Breaking News

విజయ్‌ విక్టరీ.. కొత్త పేరుతో ‘జననాయగన్‌’ రిలీజ్‌?

Published on Tue, 05/05/2026 - 07:51

నటుడు విజయ్‌ కధానాయకుడిగా నటించిన చివరి చిత్రం జననాయకన్‌. నటి పూజాహెగ్డే నాయకిగా నటించిన ఇందులో నటి మమితాబైజు, ప్రియమణి, బాలీవుడ్‌ నటుడు బాబీడియోల్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో కేవీఎన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. 

గత జనవరి 9వ తేదీన తెరపైకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్‌ సమస్యల కారణంగా ఇప్పుటికీ తెరపైకి రాలేదు. అసలు ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి. మరో పక్క ఓటీటీ హక్కులను పొందిన నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని వదిలేసిందనే ప్రచారం జోరందుకుంది. సోమవారం తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో విజయ్‌ పార్టీ విజయఢంకా మోగించడంతో పలువురు ఆ పార్టీ అధ్యక్షుడు విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

ఈ సందర్భంగా డిమాంటీ కాలనీ, కోబ్రా చిత్రాల దర్శకుడు అజయ్‌ జ్ఞానముత్తు తన ఇస్టాలో ఒక ట్వీట్‌ చేశారు. అందులో  మాంభూమికి ముదల్వర్‌(గౌరవనీయులైన ముఖ్యమంత్రి) అనే పేరుతో జననాయకన్‌ చిత్రాన్ని త్వరగా విడుదల చేయండి. సంక్రాంతికి ఈ చిత్రాన్ని మిస్‌ అయిన సెలబ్రేషన్‌ను ఈ ఏడాదంతా జరుపుకుంటామని పోస్ట్‌ చేశారు. అంతే కాకుండా విజయ్‌ ఫొటో కింద మాంభూమికి ముదల్వర్‌ అనే పేరుతో పోస్టర్‌ను కూడా పోస్ట్‌ చేశారు. నిజమే జననాయకన్‌ చిత్రం ఇంటర్నెట్‌లో లీక్‌ అయినా, ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడడానికి అభిమానులతోపాటు, చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి దీనికి మోక్షం ఎప్పుడు వస్తుందో చూడాలి.  

Videos

విజయ్ పై తల్లి, ఫ్యామిలీ అద్భుతమైన పాట

రానున్న 24 గంటల్లో హర్మూజ్ జలసంధిలో ఏం జరగబోతోంది

ఆ దమ్ము.. ఆ ఫైర్, పవన్ లో ఎందుకు లేదు..

విజయ్ సీఎం అవుతాడని ముందే చెప్పా... కేఏ పాల్ సంచలన కామెంట్స్

విజయ్ కి ఇదే.. కలిసొచ్చింది..!

కాంగ్రెస్ తో విజయ్ పొత్తు? TVK MLAలతో భేటీ..

ఊరిస్తున్న సీఎం కుర్చీ.. 108 సీట్లు వచ్చినా.. విజయకి కష్టాలే

ఎమ్మెల్యేగా గెలిచిన విజయ్ డ్రైవర్ కొడుకు

TVK ప్రధాన కార్యాలయానికి విజయ్

ప్రభాస్ Fauziకి అంతరాయం యూనిట్ సభ్యుల్లో ఒకరు మృతి

Photos

+5

సెల్ఫీ విత్‌ సీఎం విజయ్‌.. సోషల్‌ మీడియా షేక్‌ (ఫొటోలు)

+5

సొట్టబుగ్గల మెగాకోడలు లావణ్య చాన్నాళ్లకు ఇలా (ఫొటోలు)

+5

కోనసీమ జిల్లా : అరటి తోటల మధ్య అందమైన ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తమిళులు మెచ్చిన దళపతి.. నేడు ఎమ్మెల్యే విజయ్‌.. రేపు..? (ఫొటోలు)

+5

#MetGala2026 : మెట్ గాలా 2026 ఈవెంట్‌లో ఇషా అంబానీ (ఫోటోలు)

+5

ప్రముఖ నిర్మాత వీఆర్‌కే రావు మనవరాలి వివాహం (ఫొటోలు)

+5

స్విట్జర్లాండ్ వేకేషన్‌లో పెద్ది బ్యూటీ జాన్వీ కపూర్‌ (ఫొటోలు)

+5

కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్ గ్లామరస్ పోజులు (ఫొటోలు)

+5

విజయ్‌ ఇంటి దగ్గర భారీ భద్రత.. అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

విజయ్‌ విజిల్‌ మోత.. రీసౌండ్‌ ఓ రేంజ్‌లోనే.. (ఫొటోలు)