Breaking News

హైదరాబాద్‌: టీవీ సీరియల్‌ నటి అదృశ్యం

Published on Fri, 07/14/2023 - 08:19

వెంగళరావునగర్‌(హైదరాబాద్‌): స్నేహితురాలు ఇంట్లో పూజ ఉందని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి రాకుండా అదృశ్యమైన సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మధురానగర్‌ పోలీసుల సమాచారం మేరకు... రహమత్‌నగర్‌లో నివాసం ఉండే సంతోషి, నీలకంఠ దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె 8వ తరగతి వరకు చదివి బడి మాసేసింది.

ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడూ సీరియల్స్‌లో షూటింగ్‌కు వెళ్లి వస్తుండేది. ఈ క్రమంలో ఈ నెల 12న మధ్యాహ్నం తల్లి ఇంట్లో లేకపోవడంతో తన స్నేహితురాలు ఇంట్లో పూజ ఉంది వెళ్లివస్తానని సోదరుడు భరత్‌కుమార్‌కు చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం 7 గంటల సమయంలో సంతోషి కుమార్తెకు ఫోన్‌ చేయగా తాను యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్‌ వద్ద ఉన్నాను.. ఇంటికి వస్తున్నానని చెప్పింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా నెంబర్‌ కలవలేదు.
చదవండి: నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్

రాత్రంతా ఎదురు చూసినా ఇంటికి రాలేదు. గురువారం బంధువులు, స్నేహితులను విచారించి, పలు ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. దీంతో మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమె వయసు దాదాపు 16 ఏళ్లు ఉంటాయని, సుమారు 5 అడుగుల ఎత్తు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఎర్ర రంగు డ్రెస్, తెలుపు చున్నీ ధరించిందని, తెలుగు, హిందీ మాట్లాడగలదన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)