Breaking News

వివాహ బంధానికి గుడ్‌ బై చెప్పిన ప్రముఖ బుల్లితెర జంట

Published on Sat, 06/21/2025 - 19:09

ఇటీవల సినీ ఇండస్ట్రీలో విడాకుల వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ నటీనటులు సైతం తమ వివాహ బంధానికి గుడ్‌ బై చెప్పేస్తున్నారు. తాజాగా మరో జంట తమ పెళ్లి బంధానికి ఎండ్ కార్డ్ పడేసింది.  ప్రముఖ సీరియల్ నటి లతా సబర్వాల్.. తన భర్త సంజీవ్ సేథ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించారు. సుదీర్ఘమైన చర్చల తర్వాత నేను.. నా భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నాం.  నాకు అందమైన కొడుకును ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అతని భవిష్యత్తు బాగుండాలని శుభాకాంక్షలు' అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

దాదాపు పెళ్లైన 16 ఏళ్లకు తమ వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ విషయంపై ఎటువంటి ప్రశ్నలు అడగకుండా తనను, తన కుటుంబాన్ని గౌరవించాలని ప్రతి ఒక్కరిని అభ్యర్థించింది. వీరిద్దరు బుల్లితెర నటీనటులు కాగా.. 'యే రిష్టా క్యా కెహ్లతా హై' సీరియల్ సెట్స్‌లో కలుసుకున్నారు. ఈ సీరియల్‌ బాలీవుడ్‌లో అత్యంత ఆదరణ దక్కించుకున్న వాటిలో ఒకటిగా నిలిచింది. ఇందులో భార్య, భర్తల పాత్రల్లో వీరిద్దరు నటించారు. అంతేకాకుడా ఈ జంట 2013లో 'నాచ్ బలియే 6' అనే డ్యాన్స్ షోలో కూడా పాల్గొన్నారు.  

l

ఆ తర్వాత ప్రేమలో పడిన జంట 2009లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంటకు 2013లో ఓ కుమారుడు జన్మించారు. మరోవైపు సంజీవ్ సేత్‌ గతంలోనే నటి రేషమ్ టిప్నిస్‌ను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2004లో ఈ జంట విడిపోయారు. అయితే పలు సీరియల్స్‌లో తనదైన నటనతో మెప్పించిన లతా సబర్వాల్ 2021లో నటనకు గుడ్‌బై చెప్పేసింది. ఆమె సీరియల్స్‌తో పాటు 'వివా', 'ఇష్క్ విష్క్' వంటి చిత్రాలలో కూడా కనిపించింది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)