ఆర్‌ఆర్‌ఆర్‌.. జూనియర్‌ ఎన్టీఆర్‌ను సైడ్‌ యాక్టర్‌ చేశారా?

Published on Thu, 03/09/2023 - 15:53

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో జూనియర్‌ ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌.. ఏ ఒక్కరినీ తక్కువ అంచనా వేయలేం. వీరిద్దరిలో ఏ ఒక్కరు లేకపోయినా సినిమా సంపూర్ణంగా ఉండేది కాదంటే అతిశయోక్తి కాదు. నటించడంలో, అభిమానుల మనసులు గెలుచుకోవడంలో ఇద్దరూ పోటీపడి చివరకు గెలిచారు. ఇక ఈ సినిమా నుంచి నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ రేసులో దిగిన విషయం తెలిసిందే! ఈ క్రమంలో ట్రిపుల్‌ ఆర్‌ టీమ్‌ అమెరికాలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీబిజీగా ఉంది. ఈ తరుణంలో రామ్‌చరణ్‌ 'టాక్‌ ఈజీ విత్‌ సామ్‌ ఫ్రాగోసో' అనే పాడ్‌క్యాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాల గురించి చర్చించారు.

పనిలో పనిగా తాను పాటించే అయ్యప్ప మాల విశిష్టత, విధివిధానాలను సైతం వివరించాడు చరణ్‌. అయితే ఇక్కడ యాంకర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ గురించి మాట్లాడే సమయంలో ఎన్టీఆర్‌ను సైడ్‌ యాక్టర్‌ అన్నాడంటూ ఓ క్లిప్‌ వైరలవుతోంది. ఇది చూసిన తారక్‌ ఫ్యాన్స్‌ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్టీఆర్‌ను సైడ్‌ యాక్టర్‌ అనడమేంటని విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి హోస్ట్‌ తారక్‌ను సైడ్‌ యాక్టర్‌ అని అనలేదు. ఎలాంగ్‌సైడ్‌ యాక్టర్‌(నీతోపాటు కలిసి నటించిన నటుడు) అని పేర్కొన్నాడు. కావాలని కొందరు నెటిజన్లు సగం క్లిప్‌ను కట్‌ చేసి వైరల్‌ చేయడంతో ఈ వివాదం చెలరేగింది. అయితే పూర్తి పాడ్‌క్యాస్ట్‌ విన్న జనాలు ఎందుకిలా పనిగట్టుకుని ఫ్యాన్స్‌ వార్‌ సృష్టిస్తారు? అని మండిపడుతున్నారు.

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)