Breaking News

ఆలయంలో త్రిష పూజలు.. సోషల్‌ మీడియాలో ఫోటోలు వైరల్‌

Published on Mon, 12/16/2024 - 09:40

నెటిజన్లకు ఎక్కువగా కంటెంట్స్‌ ఇచ్చే నటీమణుల్లో త్రిష ఒకరు అని చెప్పవచ్చు. కారణం వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఈ చైన్నె బ్యూటీ ఎప్పుడు చర్చనీయాంశమే. వృత్తిపరంగా చూస్తే 22 ఏళ్లు పూర్తి చేసింది. తన కెరీర్‌లో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొని, జయపజయాలను చవిచూసి ఇప్పటికీ అగ్రకథానాయకి స్థానాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నారు. అంతేకాకుండా తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం భాషల్లో స్టార్‌ హీరోల సరసన నటించడానికి ఏకై క ఆప్షన్‌గా వెలుగొందుతున్నారు. ఇక వ్యక్తిగతంగా త్రిష ఎప్పుడు సంచలనమే. 

ప్రేమ వ్యవహారంలో ఈమె గురించి పలు రకాల వార్తలు ప్రచారమవుతుంటాయి. అదేవిధంగా ఇంతకుముందే త్రిష పెళ్లి నిశ్చితార్థం వరకు వెళ్లి ఆగిపోయింది. 41 ఏళ్ల పరువాల ఈ భామ ఇప్పటికీ అవివాహితే అన్నది గమనార్హం. నటుడు విజయ్‌తో ఈమెను కలుపుతూ చాలాకాలంగా వదంతులు సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. తాజాగా నటి కీర్తి సురేష్‌ వివాహానికి నటుడు విజయ్‌, త్రిష చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ప్రచారం హోరెత్తుతోంది. అయితే నటి త్రిష ఇలాంటి విషయాలను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. కాగా ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న ఈమె తాజాగా సూర్య కథానాయకుడిగా నటిస్తున్న ఆయన 45వ చిత్ర షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో నటి త్రిష  కోయంబత్తూరులోని ప్రసిద్ధిగాంచిన మరుదమలై మురుగన్‌(కుమారస్వామి) ఆలయానికి వెళ్లి స్వామి దర్శనం చేసుకుని, విశేష పూజలు నిర్వహించారు. అక్కడ ఆమెను చూసిన ఇతర భక్తులు సాధారణ ప్రజలు ఆమెతో ఫొటో తీసుకోవడానికి గుమిగూడారు. వారందరితో ఫొటోలు దిగిన త్రిష అక్కడి నుంచి బయల్దేరి వచ్చేశారు. ఆ ఫొటోలు, వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే నటి త్రిష దైవ దర్శనం చేసుకోవడంపై కూడా నెటిజన్లు ఇప్పుడు ఆరాలు తీస్తున్నారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?