Breaking News

త్రిష గతంలో ఎవర్ని ప్రేమించిందో తెలుసా?

Published on Sat, 03/07/2026 - 15:29

హీరోయిన్‌ త్రిష రెండు దశాబ్దాలకు పైగా సినీప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. వర్షం సినిమాతో తెలుగులో సెన్సేషన్‌ సృష్టించిన ఈ బ్యూటీ తమిళంలో విజయ్‌ సరసన గిల్లిలో హీరోయిన్‌గా యాక్ట్‌ చేసి స్టార్‌ స్టేటస్‌ అందుకుంది. అలా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో అనేక సినిమాలు చేసింది. 42 ఏళ్లు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే ఉండిపోయింది. 

అయితే ఈ బ్యూటీ దళపతి విజయ్‌తో ప్రేమాయణం నడుపుతుందని చాలాకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఇటీవల విజయ్‌, త్రిష జంటగా ఓ పెళ్లికి హాజరవడంతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి. అయితే త్రిష విజయ్‌ కంటే ముందు వేరే హీరోలతో లవ్‌లో పడింది. ఆ కథేంలో ఇప్పుడు చూసేద్దాం..

హీరోలతో లవ్‌
త్రిష తమిళంలో పలువురు స్టార్స్‌తో ప్రేమాయణం నడిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హీరో శింబుకి జోడీగా సినిమాలు చేస్తున్న సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ముదిరి ప్రేమగా మొగ్గలు తొడిగిందట. బయటకు వెళ్లినప్పుడు కూడా చేతిలోన చెయ్యేసి మరీ నడిచేవారు.. కానీ ఈ ప్రేమ ఎంతోకాలం నిలవలేదు. ఆ తర్వాత దళపతి విజయ్‌తో ఎక్కువ సినిమాలు చేసిన సమయంలో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. కానీ, కొంతకాలానికి ఆ రూమర్స్‌ దానంతటవే ఆగిపోయాయి.

ప్రకంపనలు రేపిన సుచీలీక్స్‌
అనంతరం త్రిష టాలీవుడ్‌ హీరో రానాకు క్లోజ్‌ అయింది. మొదట్లో వీరిద్దరూ క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఒకానొక సమయంలో ఈ స్నేహం ప్రేమగా మారింది. కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తర్వాతెందుకో విడిపోయారు. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన సుచీలీక్స్‌ వ్యవహారంలో త్రిష-రానా క్లోజ్‌ ఫోటో ఒకటి బయటకు రావడం అప్పట్లో సంచలనం రేపింది. కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌తోనూ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. త్రిష వల్లే ధనుష్‌- ఐశ్వర్య వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది.

పెళ్లి క్యాన్సిల్‌
వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెడుతూ 2015లో పెళ్లికి రెడీ అయింది త్రిష. చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్‌తో ఆమె ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. పెళ్లి చేసుకోవడమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో వివాహం రద్దు చేసుకున్నారు. పెళ్లయ్యాక సినిమాలు చేయకూడదని కండీషన్‌ పెట్టాడని, అది నచ్చకనే అతడిని పెళ్లి చేసుకోలేదని త్రిష ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. అయితే ధనుష్‌తో త్రిష అంత క్లోజ్‌గా ఉండటం నచ్చకే అతడు పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నాడని అంటుంటారు.

విజయ్‌తో లవ్‌
ఇప్పుడు మరోసారి విజయ్‌తో ప్రేమలో మునిగి తేలుతోంది త్రిష. విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది హీరో భార్య సంగీత. ఈ సమయంలో విజయ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ అందరికీ తాము ప్రేమలో ఉన్నామని చెప్పకనే చెప్తోంది. మరి విజయ్‌- సంగీత విడాకులు తీసుకున్నాక వీరు ప్రేమను పెళ్లి బంధంతో బలపర్చుకుంటారేమో చూడాలి!

చదవండి: నోటికి ఎంతొస్తే అంత అనేస్తారా? బుర్రసాయి మాధవ్‌కు వరలక్ష్మి శరత్‌కుమార్‌ కౌంటర్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)