Breaking News

బాలీవుడ్‌ వైపు మళ్లీ ఎందుకు వెళ్లలేదంటే..: త్రిష

Published on Wed, 03/27/2024 - 10:50

గత రెండు దశాబ్దాలుగా అగ్ర కథానాయకిగా బహుభాషల్లో రాణిస్తున్న నటి త్రిష. నాలుగు పదుల వయసులోనూ క్రేజీ కథానాయకిగా వెలుగొందడం సాధారణ విషయం కాదు. ఒక దశలో ఈమె నటించిన హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రాలు నిరాశపరచడంతో త్రిష పని అయ్యిపోయింది. తట్టా బుట్టా సర్దుకోవాల్సిసిందే అనే కామెంట్స్‌ వచ్చాయి. అయితే పొన్నియిన్‌ సెల్వన్‌ చిత్రంతో త్రిష సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలెట్టారు. ఇప్పుడు చేతి నిండా చిత్రాలతో,అదీ అగ్రహీరోల సరసన నటిస్తూ బిజీగా ఉన్నారు. కాగా కొందరు ప్రముఖ హీరోయిన్ల మాదిరిగానే త్రిష కూడా బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు.

అక్కడ 'కట్టా మిఠా' అనే చిత్రంలో నటించారు. అయితే అదే ఆమె నటించిన తొలి, చివరి చిత్రంగా మారింది. ఇటీవల ఒక భేటీలో తొలి హిందీ చిత్రం ప్లాప్‌ కావడంతో బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదా? అన్న ప్రశ్నకు త్రిష బదులిస్తూ తాను 2010లో కట్టా మిఠా చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటర్‌ అయ్యానన్నారు. అక్షయ్‌కుమార్‌ హీరోగా నటించిన ఆ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకుడని చెప్పారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నారు.

దీంతో బాలీవుడ్‌లో నటించిన తొలి చిత్రం ప్లాప్‌ కావడంతో అవకాశాలు రాలేదని, తాను బాలీవుడ్‌ నుంచి వైదొలగినట్లు ప్రచారం జరిగిందన్నారు. వాస్తవానికి తాను తన కుటుంబాన్ని ముంబాయికి మార్చడానికి సిద్ధంగా లేనన్నారు. బాలీవుడ్‌కు వెళ్లాలంటే దక్షిణాదిలో చాలా మందిని వదులుకోవాలన్నారు. అలాగే బాలీవుడ్‌లో తన కెరీర్‌ను మళ్లీ కొత్తగా మొదలెట్టాల్సి ఉంటుందన్నారు. అంత ఆసక్తి తనకు అప్పట్లో లేదన్నారు. అందుకే హిందీ చిత్రాల్లో కంటిన్యూగా నటించలేదని త్రిష స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ అజిత్‌ సరసన విడాముయర్చి, కమలహాసన్‌కు జంటగా థగ్‌ లైఫ్‌ చిత్రాలతో పాటు తెలుగులో చిరంజీవి సరసన విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)