Breaking News

విజయ్‌ ఆ విషయంలో మారాలి : త్రిష

Published on Wed, 02/05/2025 - 07:12

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌(Vijay) గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిందేమి ఉండదు. ప్రస్తుతం ఈయన ప్రస్తుతం హెచ్‌. వినోద్‌ దర్శకత్వంలో జననాయకన్‌ చిత్రంలో నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. కాగా రాజకీయ పార్టీని ప్రారంభించిన విజయ్‌ నటిస్తున్న చివరి చిత్రం ఇది. తదుపరి రాజకీయాలపై పూర్తిగా దృష్టి సారించనున్నారు. 

ఈ విషయం పక్కన పెడితే హీరోయిన్‌ త్రిష(Trisha) గురించి కూడా ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నటి 22 ఏళ్ల సినీ జీవితం తెరిచిన పుస్తకమే. వృత్తిపరంగానే కాకుండా, వ్యక్తిగతంగాను ఈమె పయనం సంచలనమే. త్రిషను పలువురు స్టార్‌ హీరోలతో కలిపి అనేక వదంతులు దొర్లుతుంటాయి. అలాంటివారిలో నటుడు విజయ్‌ పేరు వినిపిస్తుంది. విజయ్‌ త్రిష జంటగా మొట్టమొదటి సారిగా గిల్లీ చిత్రంలో నటించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో వీరు హిట్‌ పెయిర్‌గా ముద్ర వేసుకున్నారు. 

ఆ తర్వాత వరుసగా తిరుపాచ్చి, ఆది, కురువి చిత్రాల్లో జంటగా నటించారు. దీంతో వీరి మధ్య కెమిస్ట్రీ వర్క్‌ అవుట్‌ అయిందని ప్రచారం జరిగింది. అంతేకాదు విజయ్‌, త్రిషల మధ్య ఏదో జరుగుతుందని పదంతులు జోరందుకుంది. ఆ తర్వాత ఏమైందో గానీ వీరిద్దరూ కలిసి ఏ చిత్రంలోని నటించలేదు. అలాంటిది సుమారు 14 ఏళ్ల తర్వాత లియో చిత్రంలో మళ్లీ జత కట్టారు. ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా మంచి వసూలు సాధించింది. 

కాగా నటుడు విజయ్‌ తనకు ఎప్పుడు ప్రత్యేకమే అంటూ త్రిష ఒక భేటీలో పేర్కొన్నారు. దీంతో మళ్లీ వీరిపై రకరకాల వదంతులు ప్రసారం అవుతున్నాయి. అంతేకాకుండా ఆ మధ్య తనకు రాజకీయాలంటే ఆసక్తి అని పేర్కొనడంతో ఇప్పుడు విజయ్‌ రాజకీయ పార్టీని ప్రారంభించడంతో ఆమె నటనకు గుడ్‌ బై చెప్పి ఆ పార్టీలో చేరిపోతున్నట్లు ప్రచారం హోరెత్తింది. అయితే ఈ ప్రచారాన్ని నటి త్రిష తల్లి ఉమా కృష్ణన్‌ ఖండించారు. 

కాగా తాజాగా త్రిష నటుడు విజయ్‌ గురించి ఒక భేటీలో మాట్లాడుతూ షూటింగ్‌లో నటుడు శింబు తనను టీజ్‌ చేస్తారని, విజయ్‌ మాత్రం ఒక గోడ పక్కన చోటును వెతుక్కుని మౌనంగా కూర్చుంటారని చెప్పారు. ఆయనలో తనకు నచ్చనిది ఇదేనన్నారు. దాన్ని ఆయన మార్చుకోవాలని త్రిష పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)