Breaking News

యానిమల్‌ రిలీజ్‌ తర్వాత మూడు రోజులు ఏడ్చా: తృప్తి

Published on Wed, 10/09/2024 - 20:28

సోషల్‌ మీడియా వల్ల సెలబ్రిటీలపై ట్రోలింగ్‌ చాలా ఎక్కువైపోయింది. లుక్‌ బాలేకున్నా, సినిమాలో పాత్ర అటూఇటుగా ఉన్నా, ఏం చేసినా, చేయకపోయినా సరే నోరు పారేసుకుంటున్నారు. అలా యానిమల్‌ మూవీలోని తన పాత్ర వల్ల చాలామంది ట్రోల్‌ చేశారంటోంది హీరోయిన్‌ తృప్తి డిమ్రి.

ట్రోలింగ్‌ అంటేనే తెలీదు
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రి మాట్లాడుతూ.. 'యానిమల్‌ సినిమాకు ముందు విమర్శలనేవే తెలియదు. కానీ ఈ సినిమా వచ్చాక చాలా ట్రోల్‌ చేశారు. మెయిన్‌ స్ట్రీమ్‌లో ఉండే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే.. అయినా నేను సంతోషంగానే ఉన్నాను. బుల్‌బుల్‌, కాలా సినిమాల సమయంలో ఎవరూ విమర్శించలేదు. ఏ పోస్ట్‌ కింద చూసినా మంచి కామెంట్లే ఉండేవి. 

ఓపక్క అలా.. మరోపక్క ఇలా..
కానీ యానిమల్‌ సినిమాకు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కామెంట్లు చూస్తే పిచ్చెక్కిపోయింది. నేను నా డ్యూటీ చేశాను. ఏ తప్పు చేశానని ఇలా తిడుతున్నారని బాధపడ్డాను. ఇంత నెగెటివిటీ ఎందుకు చూపిస్తున్నారో అసలు అర్థం కాలేదు. ఓపక్క సగంమంది నన్ను మెచ్చుకుంటున్నారు. మరో పక్క మిగతా సగం మంది నన్ను కిందకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు.

చాలా ఏడ్చా..
యానిమల్‌ రిలీజయ్యాక రెండుమూడురోజులపాటు చాలా ఏడ్చాను. ఇంత ట్రోలింగ్‌ ఉంటుందని ఊహించలేదు. నేను చాలా సెన్సిటివ్‌. ఎవరితోనైనా ఫైట్‌ చేయాల్సి వస్తే నా గదిలోకి వెళ్లి తాళం వేసుకుంటాను. అలాంటిదాన్ని. ఆ సమయంలో విపరీతమైన ట్రోల్స్‌ చూశాక వర్క్‌పై కూడా శ్రద్ధ పెట్టలేకపోయాను' అని చెప్పుకొచ్చింది.

కాగా తృప్తి.. మామ్‌ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. లైలా మజ్ను, బుల్‌బుల్‌, కాలా చిత్రాల్లో నటించింది. యానిమల్‌ మూవీతో నేషనల్‌ క్రష్‌గా మారింది. ఈ బ్యూటీ ఇటీవలే బ్యాడ్‌ న్యూస్‌ సినిమాలో నటించింది.

చదవండి: దమ్ములాగిన విష్ణు.. సోనియా చెప్పింది ఈమె గురించేనా?

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)