Breaking News

'యానిమల్‌' బ్యూటీ రెమ్యునరేషన్‌ అంత తక్కువ..?

Published on Thu, 03/14/2024 - 08:29

సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ చిత్రం గతేడాదిలో విడుదలయి సూపర్ హిట్‌ కొట్టింది. బాక్సాఫీస్‌ వద్ద భారీగా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రంలోని నటీనటులకూ మంచి గుర్తింపు వచ్చింది. వారిలో త్రిప్తి డిమ్రి బాగా హైలెట్‌ అయ్యారు. ఈ సినిమా తర్వాత ఆమె పేరు సోషల్ మీడియాలో నేషనల్‌ క్రష్‌గా కూడా తెగ చక్కర్లు కొట్టింది. సినిమా వచ్చి చాలా రోజులే అయినా.. ప్రస్తుతం ఆమె రెమ్యునరేషన్‌ గురించి నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతుంది. 

ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌తో ఇంటిమేట్‌ సీన్‌లో నటించి యూత్‌కు దగ్గరైంది త్రిప్తి. యానిమ‌ల్ సినిమాలో న‌టించినందుకు కేవ‌లం రూ.40 ల‌క్ష‌లు మాత్ర‌మే పారితోష‌కం కింద ఇచ్చార‌ట‌. ఈ సినిమా చేస్తున్న సమయంలో ఆమె ఎవ‌రో ప్రేక్ష‌కుల‌కు పెద్దగా తెలియ‌దు. అంతే కాకుండా సినిమాలో కూడా ఆమె కొంత సమయం మాత్రమే కనిపిస్తుంది. అందువల్ల ఆమె త‌క్కువ పారితోష‌కానికే యానిమల్‌కు ఒప్పుకుంది. కానీ యానిమ‌ల్ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ కావడంతో త్రిప్తి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆమె ఒప్పుకుంటున్న సినిమాలకు భారీగానే డిమాండ్‌ ఉంది.

తాజాగా ఆమె 'భూల్ భుల‌యా'లో చిత్రంలో నటిస్తుంది. అందులో స్పెష‌ల్ రోల్‌ నటిస్తున్నందుకు ఆమె కోటి రూపాయ‌లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటుందట. ఈ సినిమా హిట్‌ అయితే త్రిప్తి డుమ్రి మరో కోటి పెంచడం ఖాయం అని చెప్పవచ్చు. మేరే మెహబూబ్‌ మేరే సనమ్‌, విక్కీ విద్యా కా వో వాలా వీడియో సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులోనూ ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ - గౌతమ్‌ తిన్ననూరిల స్పై థ్రిల్లర్‌లో త్రిప్తి నటించనున్నట్లు తెలుస్తోంది. రవితేజ  హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న చిత్రంలోనూ ఆమెను ఎంపిక చేసినట్లు టాక్.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)