Breaking News

వ్యాపారవేత్త ప్రేమలో త్రిప్తి డిమ్రి.. ఫోటోలు షేర్‌ చేసిన ప్రియుడు

Published on Sat, 02/24/2024 - 09:21

'యానిమల్‌' సినిమాతో టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు త్రిప్తి డిమ్రి . ఆ సినిమాలో తన నటనతో యువ హృదయాలను కొల్లగొట్టింది ఈ బ్యూటీ.  'జోయ' పాత్రలో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో లక్షల మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఐఎండీబీ (ఇండియన్‌ మూవీ డేటాబేస్‌) ఇటీవల విడుదల చేసిన మోస్ట్‌ పాపులర్‌ హీరోయిన్ల జాబితాలోనూ ఆమె మొదటి స్థానంలో నిలిచింది. అంతలా యానిమల్‌ సినిమాతో ఆమె కిక్‌ ఇచ్చింది. ఆమెకు బాలీవుడ్‌, టాలీవుడ్‌లలో వరుస అవకాశాలు వస్తున్నాయనే వార్తలు కూడా వైరలవుతున్నాయి. 

ఫిబ్రవరి 23న త్రిప్తి డిమ్రి 30వ వసంతంలోకి అడుగుపెట్టింది. తన పుట్టినరోజు కావడంతో సోషల్‌ మీడియా ద్వారా అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆమె ప్రియుడు సామ్ మర్చంట్ కూడా ఆమెకు బర్త్ డే విషెస్ తెలిపాడు. త్రిప్తితో తీసుకున్న ఒక సెల్ఫీని తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్ చేస్తూ విష్ చేశాడు. 'నా ప్రియమైన త్రిప్తికి శుభాకాంక్షలు’ అంటూ తెలిపాడు సామ్ మర్చంట్. ప్రస్తుతం వీరిద్దరి సెల్ఫీ  నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. దీంతో త్రిప్తి ప్రేమ విషయం మరోసారి తెరపైకి వచ్చింది. 

ఇంతకీ సామ్ మర్చంట్ ఎవరు ? అంటూ వివరాల కోసం త్రిప్తి ఫ్యాన్స్‌ గూగుల్‌లో వెతుకుతున్నారు. సామ్‌మర్చంట్‌ తొలుత మోడల్‌గా పనిచేసి ప్రస్తుతం వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. గోవాలో అతనికి బీచ్‌ క్లబ్స్‌తో పాటు పలు హోటల్స్‌ ఉన్నాయని తెలిసింది. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్‌ షిప్‌ గురించి అధికారికంగా ఇద్దరూ ఇప్పటి వరకు తెలుపలేదు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)