Breaking News

ఫుల్లుగా బిర్యానీ తిని షూటింగ్‌కి వెళ్లేవాడిని : త్రినాథరావు నక్కిన

Published on Wed, 08/05/2026 - 10:28

‘‘ఇప్పటి జెన్‌ జీకి ఫ్యామిలీ ఎమోషన్స్‌ పెద్దగా తెలియడం లేదు. ఈ ఎమోషన్స్‌ని మళ్లీ అందరికీ గుర్తు చేయాలనే సందేశంతోనే ‘అనకాపల్లి’ సినిమా తీశాం’’ అన్నారు దర్శక–నిర్మాత నక్కిన త్రినాథరావు. విక్రమ్‌ సహిదేవ్, సంధ్యా వశిష్ఠ, తారక్‌ పొన్నప్ప ప్రధాన తారాగాణంగా ఖగేష్‌ తమ్మినేని దర్శకత్వంలో త్రినాథరావు నక్కిన, కాండ్రేగుల నాయుడు నిర్మించిన సినిమా ‘అనకాపల్లి’. కాండ్రేగుల కుమార్‌ రాజా సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్‌ కానుంది. 

ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ– ‘‘బలమైన కుటుంబ భావోద్వేగాలతో ఓ టౌన్‌లో జరిగే లవ్‌స్టోరీ సినిమా ఇది. షూటింగ్‌ మొత్తాన్ని అనకాపల్లిలోనే పూర్తి చేశాం. అనకాపల్లి అనగానే అనకాపల్లి బెల్లం, నూకాంబిక అమ్మవారి ఆలయం కచ్చితంగా గుర్తుకువస్తాయి. ఈ రెండు అంశాలు సినిమా అంతా  కనిపిస్తాయి. ఇక ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే అందించి, నిర్మిస్తూనే, ఓ క్యారెక్టర్‌ కూడా చేశాను. నేను చేసిన ఈ మిడిల్‌ క్లాస్‌ ఫాదర్‌ పాత్రకు కాస్త పొట్ట ఉండాలని దర్శకుడు కోరారు. 

అందుకే ప్రతీ రోజూ సెట్‌కి వెళ్లేప్పుడు బిర్యానీ ఫుల్లుగా తినేసేవాడ్ని (నవ్వుతూ). కాండ్రేగుల నాయుడు మాట్లాడుతూ– ‘‘నా దృష్టిలో సినిమా అనేది చాలా గొప్పది. ఒక బడ్జెట్‌ పెడుతున్నామంటే ఎంతోమందికి ఉ΄ాధి కలుగుతుంది. కష్టపడేది వాళ్లు అయినా పేరు మాకు వస్తుంది. ఇలా కష్టపడే వాళ్ల కోసమే బ్యానర్లు స్థాపించి, సినిమాలు నిర్మిస్తున్నాం. ఈ సినిమా చాలా గ్రాండ్‌గా వచ్చింది. మంచి కథతో ΄ాటు కుటుంబ విలువలను తెలియజేసే మంచి సందేశం ఉంది’’ అని అన్నారు.   

Videos

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

ఆసియా గేమ్స్ మహిళల కబడ్డీలో భారత్ కు స్వర్ణం

ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే... కాకుమానుపై పోలీసుల తీరు.. అడ్వకేట్ రజినీ షాకింగ్ నిజాలు

ఛలో విజయవాడలో ఉద్రికత్త.. పోలీసుల జులుం.. మహిళకు గాయాలు

తొక్కేదాం అని చూసారు.. కానీ కలెక్షన్స్ తో తుక్కు రేగోడుతున్నాడు

FBI పేరుతో అకౌంట్లు బ్లాక్ చేసి.. ఇన్ఫ్లు యెన్సర్లకు 15 వేలు.. కారుమూరి సంచలన నిజాలు

జగన్, చంద్రబాబుల గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నా..

Photos

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)

+5

చూడప్పా సిద్ధప్పా.. సింహం గడ్డం గీసేసిందప్పా! (ఫొటోలు)

+5

'సిగ్మా' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)