Breaking News

సినిమా చూసిన దిల్‌ రాజు ఆ ఒక్క మాట అన్నారు: మజాకా డైరెక్టర్

Published on Fri, 02/28/2025 - 18:25

సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మజాకా. ఈ చిత్రాన్ని నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీంతో మూవీ మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మజాకా సూపర్ హిట్‌ టాక్ రావడంతో సక్సెస్ సెలబ్రేషన్స్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ త్రినాథరావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. రిలీజ్‌కు ముందు ఈ సినిమా చూసిన దిల్‌ రాజు ఓ మాట ‍అన్నారని గుర్తు చేసుకున్నారు.

దర్శకుడు నక్కిన త్రినాథరావు మాట్లాడుతూ.. 'దిల్ రాజు ఈ సినిమా చూశారు. రిలీజ్‌కు ముందు సారథి స్టూడియోలో ఈ సినిమా చూశారు. అప్పుడు నేను వెళ్లలేదు. ఆయన బయటకొచ్చి మన రాజాతో ఒక మాట అన్నారు. ఈ సినిమా పక్కా థియేటర్ మూవీ అని అన్నారు. కచ్చితంగా థియేటర్లోనే చూడాలి. అందరూ నవ్వుతుంటే మనం కూడా నవ్వాలి. అందరూ ఎమోషనల్ అవుతుంటే వారితో పాటు మనం కూడా ఫీలవ్వాలి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లోనే చూడండి. తమ్ముళ్లు మీరు కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి. మీరు మూవీని చూసిన ఫీలింగ్స్‌ మీ స్నేహితులు, బంధువులతో షేర్ చేసుకోండి' అని అన్నారు. కాగా.. మజాకా చిత్రంలో మన్మధుడు హీరోయిన్ అన్షు, రావు రమేశ్ కీలక పాత్రల్లో కనిపించారు.  
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)