Breaking News

'కర్ణ' కోసం వెళ్లిన దిల్‌ రాజు

Published on Thu, 06/15/2023 - 18:43

యదార్థ సంఘటనల ఆధారంగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కర్ణ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సనాతన క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై కళాధర్ కొక్కొండ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే స్వీయ నిర్మాణంలో హీరోగా నటిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రేక్షకుల మెప్పు పొంది  ఆసక్తి పెంచేసింది. జూన్ 23వ తేదీన ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా  తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను దిల్ రాజు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనంతరం యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెష్ చెప్పారు. 

(ఇదీ చదవండి: Adipurush: ఏకంగా లక్షకు పైగా టికెట్లు కొనేశాడు..!)

యుద్ధం శరణం శిక్షామి, స్నేహం శూన్యం రక్ష్యామి, లోకం స్వార్థం ప్రక్షామి అనే లైన్స్ షో చేస్తూ మొదలు పెట్టిన ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లో మూవీ సోల్ తెలిసేలా సన్నివేశాలు కట్ చేశారు. ముఖ్యంగా హీరోయిజం, యాక్షన్ సన్నివేశాలు హైలైట్ చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. పగ, ప్రతీకారం నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశాలకు తోడు పల్లెటూరి వాతావరణం, ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో చూడొచ్చని ట్రైలర్ స్పష్టం చేసింది.

ట్రైలర్ మొత్తం కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మేజర్ హైలైట్ అయింది. చట్టానికి చిక్కిన రవికిరణం, సంకెళ్లతో బిగిసిన ప్రతీకారం.. ద్రోహం, విద్రోహం.. కన్నీళ్లతో రగిలే ఆగ్రహం.. మేధం నరమేధం రక్తంతో రాసిన శాసనం అంటూ ఉత్కంఠ రేపే సీన్స్ చూపిస్తూ ఈ ట్రైలర్ క్లోజ్ చేశారు. చివరలో సెంటిమెంట్ సీన్స్ చూపించి ఆసక్తి పెంచేశారు.

(ఇదీ చదవండి: Adipurush: అక్కడ కేవలం 24 టికెట్లే అమ్ముడుపోయాయట)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)