Breaking News

‘పుష్ప 2’ ప్రీమియర్‌ షో.. తొక్కిసలాటలో మహిళ మృతి!

Published on Thu, 12/05/2024 - 05:22

సాక్షి, హైదరాబాద్‌:  ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది. ప్రీమియర్‌ షో చూసేందుకు అల్లు అర్జున్‌ థియేటర్‌కి రాగా..ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. అభిమానులు ఒక్కసారిగా తోసుకుంటూ రావడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. 


దిల్‌సుఖ్‌ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ (35) కు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె కుమారుడు శ్రీతేజ్‌(9)కు సీపీఆర్‌ చేసి బేగంపేట కిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన పుష్ప 2 సినిమా చూసేందుకు రేవతి తన ఇద్దరు పిల్లలు(శ్రీతేజ్‌, సన్వీక)తో బుధవారం సాయంత్రం సంధ్య థియేటర్‌కి వచ్చింది. అదే సమయంలో హీరో అల్లు అర్జున్‌ కూడా ధియేటర్‌కు వచ్చాడు. దీంతో అప్పటికే అక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చిన బన్నీ ఫ్యాన్స్‌.. ఆయనను చూసేందుకు ఎగబడడంతో తొక్కిసలాట జరిగి..రేవతి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గాంధీ మార్చురికి తరలించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)