Breaking News

యశ్‌ వల్లనే 'టాక్సిక్‌' వాయిదా.. యుద్ధం సాకు మాత్రమేనా?

Published on Tue, 03/10/2026 - 08:01

కన్నడ హీరో యశ్‌ నటించిన కొత్త చిత్రం ‘టాక్సిక్‌’.. దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌ తెరకెక్కించిన ఈ మూవీని  వెంకట్‌ కె. నారాయణ, యశ్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మార్చి 19న విడుదల కావాల్సిన టాక్సిక్‌ను సడెన్‌గా వాయిదా వేశారు.  ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా దీన్ని జూన్‌ 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, అసలు నిజం మరోకటని నెట్టింట వార్తలు వస్తున్నాయి.

టాక్సిక్‌ సినిమా వాయిదాకు అసలు కారణాలు ఇవ్వే అంటూ పలు కథనాలు వస్తున్నాయి. ఇటీవల యష్ కోసం ఒక ప్రత్యేక స్క్రీనింగ్‌ను మేకర్స్‌ ఏర్పాటు చేశారట. ఫైనల్ అవుట్‌పుట్ విషయంలో యశ్‌ సంతృప్తి చెందాడని సమాచారం. ముఖ్యంగా మూవీలో VFX,  నేపథ్య సంగీతం అతన్ని నిరాశపరిచాయని, అందుకే అతను విడుదలను వాయిదా వేయమని సూచించారట. మూవీలోని లోటుపాట్లను సరిచేసి రిలీజ్‌ చేద్దామని ఆయన కోరారట. దీంతో అసలు విషయం చెప్పకుండా  పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నామనేది కేవలం సాకు మాత్రమేనని నెట్టింట వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇదే నిజమైతే సినిమా అవుట్‌ఫుట్‌ మరింత బలంగా వస్తుందని ఫ్యాన్స్‌ అంచనా వేస్తున్నారు.

టాక్సిక్‌ చిత్రంలో యశ్‌తో పాటు  హ్యుమా ఖురేషీ , నయనతార, కియారా, తారా సుతారియా,  రుక్మిణి వసంత్‌ నటించారు. ఈ మూవీ ఇంగ్లిష్, కన్నడ భాషల్లో నేరుగా, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో డబ్బింగ్‌ వెర్షన్‌లో రిలీజ్‌ కానుంది. ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు రిలీజ్‌ హక్కులను ‘దిల్‌’ రాజు సొంతం చేసుకున్నారు.  జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

వాయిదాపై నిర్మాణ సంస్థ ఏం చెప్పింది
టాక్సిక్‌ వాయిదా గురించి చిత్ర నిర్మాణ సంస్థ ఇలా చెప్పింది. ‘‘మిడిల్‌ ఈస్ట్‌ కంట్రీస్‌లో నెలకొన్న ప్రస్తుత అనిశ్చితి, యుద్ధ వాతావరణం నేపథ్యంలో విడుదలను వాయిదా వేయాలనుకున్నాం. ఓవర్సీస్‌లో ప్రధాన పంపిణీ భాగస్వామి అయిన ఫార్స్‌ ఫిల్మ్స్‌ సలహా ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. గల్ఫ్‌ ్రపాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, దాని ఫలితంగా సినిమా కార్యకలాపాలకు అంతరాయాలు ఏర్పడటం కూడా విడుదల వాయిదాకి ఓ కారణం’’ అని యూనిట్‌ పేర్కొంది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)