సీఎం పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
Breaking News
టాక్సిక్ మరోసారి వాయిదా.. మేకర్స్ ఏమన్నారంటే?
Published on Tue, 04/14/2026 - 15:15
కన్నడ హీరో యశ్.. గీతూ మోహన్ దాస్ డైరెక్షన్లో నటిస్తోన్న చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించింది. టీజర్ కాస్తా బోల్డ్‌గా ఉండడంతో మేకర్స్‌పై విమర్శలొచ్చాయి. అయినప్పటికీ ఈ టీజర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఈ సినిమా నుంచి ఓ సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా విడుదల ఇప్పటికే ఓ సారి వాయిదా పడింది.
ఈ నేపథ్యంలోనే టాక్సిక్ మరోసారి వాయిదా పడుతుందన్న వార్తలొస్తున్నాయి. ఈ మూవీ జూన్ 4వ తేదీన రిలీజ్ కానుందని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ సినిమా రిలీజ్‌కు కేవలం 40 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో ఈ సినిమా వాయిదా పడుతుందని ఫ్యాన్స్‌లో మరో ఆందోళన కలిగిస్తోంది.
తాజాగా వాయిదా వార్తలను టాక్సిక్ టీమ్ ఖండించింది. చెప్పిన ప్రకారం జూన్ 4వ తేదీనే విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు యష్ ప్రస్తుతం అమెరికాలో 'రామాయణం' ప్రచార కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
కాగా.. ఈ చిత్రంలో కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. కేవీఎన్ ప్రోడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్‌పై వెంకట్ కె.నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, కన్నడ భాషల్లో నేరుగా, హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.
Tags : 1