Breaking News

యశ్ టాక్సిక్‌.. రిలీజ్‌కు ముందే రికార్డ్స్.. మరో బిగ్ డీల్..!

Published on Tue, 02/10/2026 - 17:43

శాండల్‌వుడ్ హీరో యశ్ నటిస్తోన్న మోస్ట్ అవేటేడ్ యాక్షన్ థ్రిల్లర్‌ టాక్సిక్. కేజీఎఫ్-‌2 తర్వాత రాకింగ్‌ స్టార్ ఈ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. ముఖ్యంగా బోల్డ్ సీన్‌ పెట్టడంపై దర్శకురాలిపై విమర్శలు చేశారు. ఈ చిత్రానికి  గీతూ మోహన్‌ దాస్‌ దర్శకత్వం వహంచారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 19న థియేటర్లలో సందడి చేయనుంది. ఇప్పటికే ఈ మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్‌ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర డిస్ట్రిబ్యూటర్స్ దక్కించుకుంది. దాదాపు రూ.120 కోట్ల డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ మూవీకి మరో బిగ్ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఓవర్‍సీస్‌లో ఇండియన్ లాంగ్వేజేస్‌కి దాదాపు రూ.105 కోట్లకు బిజినెస్‌ ఓకే అయినట్లు సమాచారం.  ప్రముఖ విదేశీ పంపిణీదారు అయిన ఫార్స్ ఫిల్మ్స్‌తో ఈ డీల్‌ చేసుకుంది. దీంతో ఒక ఇండియన్ సినిమాకు అత్యధిక డీల్ సాధించిన చిత్రంగా టాక్సిక్ నిలవనుంది. రూ. 105 కోట్ల విదేశీ డీల్ రావడం భారతీయ సినిమాకు  దక్కిన ఘనతగా భావిస్తున్నారు.

ఈ ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ డీల్‌తో ఓవర్‌సీస్‌లో ఇండియన్ భాషల్లో ఫార్స్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది. ఈ బిగ్‌ డీల్ భారతీయ చిత్రానికి ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ విడుదల అవుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం నేపాల్, జపాన్, చైనా మినహా దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లో విడుదల కానుంది. కాగా.. ఈ చిత్రాన్ని ఓకేసారి కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించారు. ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)