Breaking News

టూరిస్ట్ ఫ్యామిలీ డైరెక్టర్‌ పెళ్లి.. నిర్మాత ఖరీదైన గిఫ్ట్‌!

Published on Tue, 10/28/2025 - 18:12

చిన్న సినిమా అయినా సరే కంటెంట్‌ ఉంటే చాలు.. ఆడియన్స్ బ్రహ్మరథం పట్టేస్తారు. పెద్ద స్టార్స్ లేకపోయినా బాక్సాఫీస్ హిట్‌ చేసేస్తారు. అలాంటి సినిమా ఈ ఏడాది అలరించిన టూరిస్ట్ ఫ్యామిలీ. సింపుల్ స్టోరీతో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఆడియన్స్ ఆదరణ దక్కించుకుంది.

ఈ ఏడాది మే 1న తమిళంలో రిలీజైన ఈ చిత్రం.. దాదాపు నెలరోజుల పాటు హౌస్‪‌ఫుల్ కలెక్షన్స్‌ సాధించింది . కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌ పెడితే ఏకంగా రూ.75 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. ఈ మూవీతో అభిషన్ జీవింత్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతో సక్సెస్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. అభిషన్ జీవింత్‌ యూట్యూబర్ కావడం మరో విశేషం.

అయితే తాజాగా టూరిస్ట్‌ ఫ్యామిలీ డైరెక్టర్‌ అభిషన్‌కు సంబంధించి గుడ్ న్యూస్‌ వచ్చేసింది. ఆయన ఈనెల 31న పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ సందర్భంగా టూరిస్ట్ ఫ్యామిలీ నిర్మాత మాగేశ్ రాజ్‌ ఖరీదైన బహుమతిచ్చారు. పెళ్లి చేసుకోబోతున్న అభిషన్‌కు బీఎండబ్ల్యూ కారును మ్యారేజ్‌ గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు డైరెక్టర్‌కు విషెస్ చెబుతున్నారు.

 

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)