Breaking News

ఏది ఏమైనా... మిషన్‌ పాజిబుల్‌ 

Published on Sun, 03/17/2024 - 00:24

హాలీవుడ్‌లో ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ ఫ్రాంచైజీ సూపర్‌హిట్‌. ఈ ఫ్రాంచైజీల్లో హాలీవుడ్‌ స్టార్‌ టామ్‌ క్రూజ్‌ చేసే యాక్షన్‌ విన్యాసాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి ఏడు సినిమాలు వచ్చాయి. తాజాగా ఎనిమిదో భాగం చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’లోని ఐదు, ఆరు, ఏడు విభాగాలను డైరెక్ట్‌ చేసిన క్రిస్టోఫర్‌ మెక్వారీయే ఎనిమిదో భాగాన్ని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ సౌత్‌ ఈస్ట్‌ ఇంగ్లాండ్‌ లొకేషన్స్‌లో ప్రారంభమైంది.

కొంత చిత్రీకరణ జరిగాక ఆ  ్రపాంతంలోని ఎమ్‌ 25 అనే ఓ ప్రముఖ రోడ్డును తాత్కాలికంగా క్లోజ్‌ చేశారట. ఈ రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్నాయని సమాచారం. కానీ ‘మిషన్‌ ఇంపాజిబుల్‌ 8’ షూటింగ్‌ను కొనసాగించాలంటే ఈ రోడ్డు ద్వారా లొకేషన్‌కు వెళ్లాలట. దీంతో ప్రత్యేకంగా హెలికాప్టర్స్‌ని ఏర్పాటు చేశారట. రోడ్డు మార్గం ద్వారా కాకుండా గగన మార్గాన టామ్‌ క్రూజ్‌ అండ్‌ టీమ్‌ లొకేషన్‌కు వెళ్తున్నారని హాలీవుడ్‌ టాక్‌.

పోనీ.. ఈ రోడ్డు మరమ్మతు పూర్తయ్యేవరకూ ఆగి, ఆ తర్వాత షూటింగ్‌ను మళ్లీ ఆ లొకేషన్‌లో తిరిగి ఆరంభించానే ఆలోచన కూడా చేశారట. కానీ రోడ్డు రిపేర్‌కి చాలా టైమ్‌ పడుతుందని, హెలికాప్టర్స్‌తో లొకేషన్‌కి వెళ్లే ఖర్చుతో పోలిస్తే సినిమా ఆలస్యం కావడం వల్ల జరిగే నష్టమే ఎక్కువని క్రూజ్‌ అండ్‌ టీమ్‌ భావించిందని హాలీవుడ్‌ భోగట్టా. ఇలా ‘మిషన్‌ ఇంపాజిబుల్‌’ షూటింగ్‌ను ఏది ఏమైనా ఆగేదే లేదంటూ.. పాజిబుల్‌ చేశారు టామ్‌ క్రూజ్‌ అండ్‌ టీమ్‌.  ఈ సినిమా 2025 వేసవిలో రిలీజ్‌ కానుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)