Breaking News

'నా భార్య గర్భంతో ఉంది.. ఆ సినిమా చూడలేకపోయాం': కిరణ్ అబ్బవరం

Published on Thu, 03/13/2025 - 19:35

టాలీవుడ్ యంగ్ హీరో కిరణం అబ్బవరం మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. క మూవీ తర్వాత ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'దిల్ రూబా'. ఈ మూవీలో రుక్సార్ థిల్లాన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ రొమాంటిక్ లవ్‌ ఎంటర్‌టైనర్‌కు విశ్వ కరుణ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ రిలీజ్ నేపథ్యంలో కిరణ్ పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన మలయాళ హిట్ మూవీ మార్కో గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

తన భార్య రహస్య గోరఖ్‌తో కలిసి ఉన్ని ముకుందన్‌ నటించిన మార్కో సినిమాకు వెళ్లినట్లు కిరణ్ అబ్బవరం వెల్లడించారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు చూసి తను అసౌకర్యంగా ఫీలవడంతో బయటికి వచ్చేసినట్లు తెలిపారు. సినిమా మధ్యలోనే ఇంటికి వెళ్లిపోయామని కిరణ్ పేర్కొన్నారు. తన భార్య గర్భంతో ఉండడంతో వయోలెన్స్‌ మూవీ చూడలేక వెనక్కి వచ్చేశామని కిరణ్ వివరించారు.

ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ..'నా భార్యతో నేను మార్కో మూవీ చూసేందుకు వెళ్లా. ఫుల్ వయోలెన్స్‌గా ఉండడంతో నా భార్య అసౌకర్యంగా ఫీలైంది. అందువల్లే మూవీ మధ్యలోనే బయటికి వచ్చేశాం. క్లైమాక్స్ సీన్‌ వరకు ఉండలేదు. ఇలాంటి సినిమాల ప్రభావం జనాలపై పూర్తిస్థాయిలో ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వందలో పదిశాతం ప్రభావం ఉండొచ్చు. అలా అని ఆ సినిమాలో పాటలు, సీన్స్‌ను వదిలేయడం లేదు కదా. ఇలాంటి సినిమాల ప్రభావం వయస్సు బట్టి మారుతూ ఉంటుంది' అని తెలిపారు. కాగా.. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న దిల్‌ రుబా మార్చి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)