'మ్యాడ్‌-3'లో యంగ్‌ బాయ్స్‌ ఎంట్రీ.. ఈసారి హరర్‌

Published on Mon, 02/02/2026 - 08:22

నాన్​ స్టాప్​ పంచులతో 2023లో విడుదలైన హిట్‌ సినిమా ‘మ్యాడ్‌’ (Mad) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇదే ఊపులో గతేడాదిలో వచ్చిన మ్యాడ్‌ స్క్వేర్‌(Mad Square) కూడా భారీ విజయం అందుకుంది. ఈ రెండు చిత్రాలలో నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌ మెప్పించారు అయితే, ఈ ఏడాదిలో మ్యాడ్‌ క్యూబ్‌ రానుంది. ఇందులో కొత్త వారు ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్‌ కూడా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ను కల్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మ్యాడ్‌  క్యూబ్‌ చిత్రంలోకి కొత్తవారు ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నార్నె నితిన్‌, సంగీత్‌ శోభన్‌, రామ్‌ నితిన్‌లలో ఎవరో ఒక్కరు మాత్రమే పార్ట్‌-3లో ఉంటారట. ఈసారి కొత్తవారితో ప్రేక్షకులను మెప్పించాలని చిత్ర యూనిట్‌ ఉన్నట్లు టాక్‌. ఈ క్రమంలోనే మ్యాడ్‌ క్యూబ్‌ ప్రాజెక్ట్‌లోకి  లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ఎంట్రీ ఇచ్చారని తెలుస్తోంది.

మ్యాడ్ 3ని హార‌ర్ కామెడీగా తెర‌కెక్కించ‌బోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ షూటింగ్ మొద‌లుకాక‌ముందే  ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మ్యాడ్ 3 హార‌ర్ కామెడీగా రూపొంద‌నున్న‌ట్లు క్లారిటీ రావడంతో ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాయ్స్ హాస్ట‌ల్‌లోకి ఓ లేడీ ద‌య్యం వస్తే ఎలా ఉంటుంది..? ఆ ద‌య్యం కార‌ణంగా ముగ్గురు హీరోలు ప‌డే ఇబ్బందుల నేప‌థ్యంలో ఈ సినిమా రూపొంద‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Videos

Oracle: ఐటీ ఉద్యోగులకు బిగ్ షాక్ భారీగా ఉద్యోగాలు కోత

జోగి ఇంటిపై దాడి కేసులో 11 మంది అరెస్ట్.. వెంటనే రిలీజ్

జోగి ఇంటిపై దాడి కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

ఇది ఇక్కడితో ఆగదు ఫ్యాన్స్ కు చిరు సర్ప్రైజ్

Jogi Ramesh: నువ్వు పెద్ద పుడింగిలా ఫీల్ అవ్వకు నీ రెడ్ బుక్ మడిచి పెట్టుకో..

తగిన మూల్యం చెల్లిస్తారు..అంబటి, జోగి రమేష్ ఇళ్లపై దాడి తమ్మినేని సీతారాం సీరియస్ రియాక్షన్

TVK Vijay: విజయం మనదే..! ఇది ఫిక్స్

Advocate Rajini: టీడీపీ గూండాలపై ఫిర్యాదు..

కులం పేరుతో దూషించారు మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు.. అంబటి అల్లుడు వార్నింగ్

కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్

Photos

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)

+5

వితికా షేరు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)