Breaking News

ప్రముఖ రచయిత ఆకెళ్ళ కన్నుమూత

Published on Sat, 09/20/2025 - 07:10

ప్రముఖ సినీ, నాటక రచయిత ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణ (75) కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్‌లోని తన నివాసంలో మరణించారు. చిన్నతనం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించిన ఆయన 80కి పైగా తెలుగు సినిమాలకు మంచి కథలను, మాటలను అందించారు. ఎక్కువగా మహిళల జీవితానికి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా ఆయన రచనలు ఉంటాయి. 1997లో తొలిసారిగా ‘కాకి ఎంగిలి’ అనే నాటకాన్ని రాశాడు. తరువాత ‘అల్లసాని పెద్దన’, ‘రాణి రుద్రమ’, ‘రాణాప్రతాప్‌’ లాంటి చారిత్రక నాటకాలు రాశారు.

1983లో విడుదలైన చిరంజీవి బ్లాక్‌బస్టర్‌ చిత్రం మగమహారాజుకు కథ ఆకెళ్ళనే అందించారు. ఇదే మూవీతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత కె.విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన  స్వాతిముత్యం, శ్రుతిలయలు, సిరివెన్నెల వంటి హిట్‌ చిత్రాలకు డైలాగ్స్‌ రచయితగా పనిచేశారు. 13 సార్లు ఉత్తమ రచయితగా నంది అవార్డును అందుకున్నారు. సుమారు 200 కథలు, 20 నవలలను రచించారు. వీటిలో కొన్ని ఇతర భారతీయ భాషలలోకి అనువదించబడ్దాయి. టీవీ సీరియల్స్‌కి దాదాపుగా 800 ఎపిసోడ్స్‌ రాశారు. ఆకెళ్ళ వెంకట సూర్యనారాయణకు భార్య రామలక్ష్మి, నలుగురమ్మాయిలు, ఒక కుమారుడు ఉన్నారు. శనివారం సాయంత్రం నిజాంపేటలో ఆయన అంత్యక్రియల్ని నిర్వహించనున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)