Breaking News

మహేశ్ బాబు 'గుంటూరు కారం' మూవీ.. ఎక్కడ తేడా కొట్టిందంటే!

Published on Mon, 02/05/2024 - 18:47

టాలీవుడ్ హీరో మహేశ్ బాబు- మాటల మాంత్రికుడు కాంబోలో కొత్త ఏడాదిలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. అయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయింది. త్వరలోనే ఈ చిత్రం ఓటీటీలోనూ సందడి చేయనుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగుతో పాటు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది. ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించగా.. తమన్‌ సంగీతమందించారు.

(ఇది చదవండి: ఆ సమయంలో రాజేంద్ర ప్రసాద్‌ చాలా ఇబ్బంది పెట్టారు: ఎస్వీ కృష్ణారెడ్ఢి)
 
అయితే ఇదిలా ఉండగా.. టాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలు అందించిన డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతేడాది బిగ్‌బాస్ సోహెల్ హీరోగా ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన తన చిత్రాలు ఫ్లాఫ్ కావడంపై స్పందించారు. అదే క్రమంలో ఇటీవలే రిలీజైన మహేశ్ బాబు గుంటూరు కారం సక్సెస్ కాకపోవడంపై తనదైన శైలిలో మాట్లాడారు. ఎప్పుడైతే హీరోలకు తగ్గట్టుగా కథను నడిపిస్తామో.. అక్కడే తేడా కొడుతుందని అన్నారు. అప్పటి టాప్ హీరోల చిత్రమైనా.. గుంటూరు కారం సినిమా అయిన ఇదే జరుగుతుందన్నారు.

ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు స్టార్‌డమ్‌కు తగినట్లుగా కథను నడిపించాలని త్రివిక్రమ్ భావించారు. కానీ ఎప్పుడు అలా చేయకూడదు. కథను బేస్ చేసుకునే సినిమాలు తీయాలి. అంతేకానీ స్టార్‌డమ్‌ను నమ్ముకుంటే అక్కడే తేడా కొడుతుంది. నా సినిమా యమలీల అందుకే పెద్ద హిట్ అయింది. కానీ మిగతా సినిమాలకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది.' అని అన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)