Breaking News

ఓటీటీకి హ్యాపీ డేస్ హీరో మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on Fri, 01/10/2025 - 21:53

హ్యాపీ డేస్‌లో నటించిన హీరో రాహుల్ టైసన్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి, అమీ ఏల, ఐశ్వర్య రాజ్ నటించిన చిత్రం  "100 క్రోర్స్"(100 crores). గతేడాది సెప్టెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఎస్ ఎస్ స్టూడియోస్ పతాకంపై దివిజ కార్తీక్, సాయి కార్తీక్ నిర్మించారు. ఈ చిత్రానికి విరాట్ చక్రవర్తి దర్శకత్వం వహించారు.

తాజాగా ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈనెల 11 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ‍ద్వారా వెల్లడించారు. ఈ సినిమా ప్రతి సన్నివేశం ఉత్కంఠభరితంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందో ప్రేక్షకులు ఊహించలేరు. ఊహించని మలుపులతో, థ్రిల్లింగ్ యాక్షన్ సీక్వెన్సులతో కథ నడుస్తుంది.  2016లో జరిగిన యథార్థ కథ ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతాన్ని అందించారు. నేనే నా, కాజల్ కార్తీక, కాళరాత్రి, లిటిల్ హార్ట్స్, టీనెజర్స్, శాకాహారి లాంటి మంచి చిత్రాలని ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు అందించిన హనుమాన్ మీడియా ఇప్పుడు "100 క్రోర్స్" చిత్రంతో మీ ముందుకు వస్తోంది.

ఈ సందర్భంగా హనుమాన్ మీడియా అధినేత బాలు చరణ్ మాట్లాడుతూ..'100 క్రోర్స్ ఒక అద్భుతమైన యాక్షన్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్.  జనవరి 11న ఆహా లో విడుదలయ్యే ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది. అందరూ తప్పక చూడండి. థియేటర్లలో ఈ చిత్రాన్ని మిస్ అయిన వారు, మళ్లీ చూడాలనుకునే వారు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి.  100 క్రోర్స్ ఆహాలో సూపర్ హిట్ అవుతుంది" అని తెలిపారు.

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)