Breaking News

వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెట్టిన స్టార్‌ హీరోలు వీరే!

Published on Tue, 12/12/2023 - 00:01

సినిమా అంటే కొన్ని పరిమితులుంటాయి. వెబ్‌ సిరీస్‌లకు హద్దులు లేవు. రొమాన్స్, వయొలెన్స్, సెంటిమెంట్‌.. ఏదైనా కొంచెం ఓవర్‌గా చూపించొచ్చు. ఈ నేపథ్యంలో సినిమా స్టార్స్‌ తమ ఇమేజ్‌కి భిన్నమైన క్యారెక్టర్లు, కథలు ఒప్పుకుని వెబ్‌ వరల్డ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ ఏడాది వెబ్‌ వరల్డ్‌లోకి వేంచేసిన స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.


► ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్‌ హీరోలలో ఒకరైన వెంకటేశ్‌ ఓటీటీ వరల్డ్‌ కోసం కొత్త ట్రాక్‌లోకి వచ్చారు. కాస్త అడల్ట్‌ కంటెంట్‌ ఉన్న ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ చేశారు. అమెరికన్  క్రైమ్‌ డ్రామా ‘రే డోనోవన్ ’ ఆధారంగా ‘రానా నాయుడు’ వెబ్‌ సిరీస్‌ తీశారు దర్శక ద్వయం సుపర్ణ్‌ వర్మ, కరణ్‌ అన్షుమాన్ . వెంకటేశ్‌తో పాటు రానా, సుశాంత్‌ సింగ్, అభిషేక్‌ బెనర్జీ, సుచిత్రా పిళ్లై కీలక పాత్రలు చేశారు.

కథ విషయానికొస్తే.. సెలబ్రిటీల సమస్యలను పరిష్కరించే రానా నాయుడు (రానా)కు అతని తండ్రి నాగ నాయుడు (వెంకటేశ్‌) అంటే ద్వేషం. పదిహేనేళ్ల జైలు జీవితం తర్వాత తిరిగొచ్చిన నాగ నాయుడుతో రానా నాయుడు తిరిగి కలుస్తాడా? నాగ నాయుడు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? అనే అంశాలతో ఈ సిరీస్‌ సాగుతుంది. పది ఎపిసోడ్ల ఈ సిరీస్‌కి డైలాగ్స్‌ పరంగా విమర్శలు వచ్చినప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా ఈ ఏడాది మార్చి 10 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. ‘రానా నాయుడు’ సెకండ్‌ సీజన్  కూడా ఉంటుంది.

► ‘దూత’గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య. ఆయన హీరోగా ‘మనం’, ‘థ్యాంక్యూ’ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌ కె. కుమార్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ జానర్‌ ‘దూత’కు దర్శకుడు. ఎనిమిది ఎపిసోడ్స్‌గా సాగే ఈ సిరీస్‌లో పార్వతి తిరువోతు, ప్రియాభవానీ శంకర్, పశుపతి కీలక పాత్రలు పోషించారు. పాత్రికేయ విలువల కన్నా ధనమే ముఖ్యమని భావించే ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్‌ సాగర్‌ వర్మ (నాగచైతన్య పాత్ర) ‘సమాచార పత్రిక’కు చీఫ్‌ ఎడిటర్‌గా బాధ్యతలు స్వీకరిస్తాడు. సాగర్‌కు దొరికే పేపర్‌ క్లిప్పింగ్‌లో ఉన్నవారు చనిపోతుంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది? సాగర్‌ ఏం చేశాడు? అన్నది ‘దూత’ సిరీస్‌లో చూడొచ్చు. డిసెంబరు 1 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

► ‘హనుమాన్  జంక్షన్ ’, ‘స్వయంవరం’, ‘చిరునవ్వుతో..’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపీ గోపికా గోదావరి’ వంటి సినిమాల్లో నటించిన వేణు తొట్టెంపూడి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వెండితెరపై కాస్త స్లో అయిన వేణు డిజిటల్‌ తెరపై సత్తా చాటాలని హారర్‌ థ్రిల్లర్‌ జానర్‌లో సాగే ‘అతిథి’ వెబ్‌ సిరీస్‌లో నటించారు. అవంతికా మిశ్రా, అదితీ గౌతమ్‌ కీలక పాత్రలు పోషించారు. వైజీ భరత్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఆరు ఎపిసోడ్స్‌గా సాగుతోంది. దెయ్యాలు ఉన్నాయని ప్రచారం సాగే దెయ్యాల మిట్ట అనే ప్రాంతానికి సమీపాన సంధ్య నిలయం  అనే పెద్ద భవంతిలో రచయిత రవివర్మ (వేణు తొట్టెంపూడి), అతని భార్య సంధ్య (అదితీ గౌతమ్‌) నివసిస్తుంటారు.

అయితే దెయ్యాలు లేవని నమ్మే యూట్యూబర్‌ సవారి (వెంకటేశ్‌ కాకుమాను) అక్కడికి వెళ్తాడు. అక్కడ జరిగిన కొన్ని ఘటనలకు భయపడి సంధ్య నిలయంకు వెళ్తాడు. తన కంటే ముందే సంధ్య నిలయంకు వచ్చిన మాయ (అవంతిక మిశ్రా) చనిపోతుందని తెలుసుకుంటాడు సవారి. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా దెయ్యాల మిట్టలో దెయ్యాల సంచారం ఉందా? మాయ చావుకు కారణం ఎవరు? ఫైనల్‌గా సవారి ఏం తెలుసుకుంటాడు? అన్నది క్లుప్తంగా ‘అతిథి’ సిరీస్‌ కథ. ఈ ఏడాది సెప్టెంబరు 10 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ అవుతోంది.

► నటుడు, దర్శకుడు జేడీ చక్రవర్తి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఈ ఏడాది వెబ్‌ వరల్డ్‌లో డబుల్‌ ధమాకా ఇచ్చారు జేడీ. ఆయన టైటిల్‌ రోల్‌ చేసిన వెబ్‌ సిరీస్‌ ‘దయా’. ఈ సిరీస్‌కు పవన్  సాధినేని దర్శకుడు. ఈషా రెబ్బా, పృథ్వీరాజ్, రమ్యా నంబీసన్ , కమల్‌ కామరాజు కీలక పాత్రలు పోషించారు. చేపలు ట్రాన్స్పోర్ట్‌ చేసే ఫ్రీజర్‌ వ్యాన్  డ్రైవర్‌ దయా (జేడీ చక్రవర్తి). అతని భార్య అలివేలు (ఈషా రెబ్బా) నిండు గర్భిణి. ఓ రోజు దయా పని మీద కాకినాడకు బయలుదేరతాడు.

అయితే తన వ్యాన్ లో శవం ఉందని తెలుసుకుని షాక్‌ అవుతాడు. ఆ శవం దయా బండిలోకి ఎందుకు వచ్చింది. ఈ ఘటనకు, జర్నలిస్ట్‌ కవిత (రమ్యా నంబీసన్‌)కు సంబంధం ఏంటి? అనేది సిరీస్‌లో చూడాలి. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ ఆగస్టు 4 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది. అలాగే జేడీ చక్రవర్తి ఓ ముఖ్య పాత్రలో నటించిన మరో వెబ్‌ సిరీస్‌ ‘తాజా ఖబర్‌’ జనవరి 5 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

► ఆది సాయికుమార్‌ నటించిన వెబ్‌ సిరీస్‌ ‘పులిమేక’. ఈ సిరీస్‌కు కె. చక్రవర్తి రెడ్డి దర్శకుడు. లావణ్యా త్రిపాఠి ఓ లీడ్‌ రోల్‌ చేశారు. కథ విషయానికొస్తే...హైదరాబాద్‌లో జరుగుతున్న పోలీసుల వరుస హత్యల మిస్టరీని చేధించేందుకు రంగంలోకి దిగుతారు కిరణ్‌ ప్రభ (లావణ్యా త్రిపాఠి). ఫోరెన్సిక్‌ హెడ్‌ ప్రభాకర్‌ శర్మగా పోలీ సులకు హెల్ప్‌ చేస్తుంటాడు ఆది సాయికుమార్‌. మరి.. కిల్లర్‌ను కిరణ్‌ ప్రభ పట్టుకున్నారా? అతను పోలీసులనే ఎందుకు టార్గెట్‌ చేస్తున్నాడు? అనేది ‘పులి మేక’ సిరీస్‌ కథాంశం. ఎనిమిది ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్‌ ఫిబ్రవరి 24 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)