Breaking News

టాలీవుడ్ అందాల తారలు.. తళుక్కున మెరిశారు!

Published on Tue, 02/25/2025 - 07:03

సినిమాలో కథానాయకలుగా రాణించడం అంత సులభం కాదు. అందం ఉండాలి, ప్రతిభ ఉండాలి. అంతకు మించి అవకాశాలు రావాలి. ఇవన్నీ కలగలిపిన తారలు ఎప్పటికీ అభిమానుల గుండెల్లో గూడు కట్టుకుని ఉండిపోతారు. అలాంటి వారిలో నటి మీనా, రోజా, రంభ వంటి 1990 క్రేజీ కథానాయకలుగా గుర్తింపు పొందారు. నటి మీనా బాల నటిగా రంగప్రవేశం చేసి అందరి మనసులను గెలుచుకున్నారు. ఆ తరువాత తెలుగు, తమిళం, మలయాళం తదితర భాషల్లో కథానాయకిగా అగ్రస్ధానంలో రాణించారు.  ఇక నటి రోజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ రాణించిన తార.

అదే విధంగా అందాలకు చిరునామాగా మారిన నటి రంభ. వీరందరూ తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో స్టార్‌ హీరోల సరసన నటించి పేరు గడించిన బ్యూటీలే. కాగా స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తున్న తరుణంలోనే నటి మీనా విద్యాసాగర్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్‌ అయ్యారు. వీరికి నైనిక అనే కూతురు కూడా ఉంది. అలా ఆనందమయంగా సాగుతున్న మీనా జీవితంతో విధి ఆడుకుంది. ఆమె భర్త అనారోగ్యం కారణంగా కన్ను మూశారు. ఆ  సంఘటన నుంచి బయట పడటానికి నటి మీనా చాలా కాలం పట్టింది.

కాగా ఇటీవలే మళ్లీ బయట ప్రపంచంలోకి వస్తున్న మీనా ఆదివారం సాయంత్రం చెన్నైలో నటి రోజా, రంభ, సంగీత, మహేశ్వరి, శ్రీదేవి వంటి స్నేహితురాళ్లను కలిశారు. వీరితో పాటు డాన్సింగ్‌ స్టార్‌ ప్రభుదేవా, నటుడు భరత్‌ తదితరులు ఉన్నారు. వీరంతా మాటా ఆట పాటలతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను నటి మీనా తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో ప్రేమ, ఆదరణ, గత మధుర  జ్ఞాపకాలతో ఒక అందమైన సాయం సమయం అని పేర్కొన్నారు. కాగా ఆ ఫొటోలు  ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)