Breaking News

ఆ ఫోటోలతో మాకు సంబంధం లేదు.. వాస్తవాలు తెలుసుకోండి: సందీప్ కిషన్

Published on Thu, 07/11/2024 - 07:13

టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌ రెస్టారెంట్‌ ఫుడ్‌ సెప్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అధికారుల తనిఖీల్లో భాగంగా వివాహ భోజనంబు రెస్టారెంట్‌ నిబంధనలు పాటించలేదని సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. గడువు ముగిసిన చిట్టిముత్యాలు రైస్‌ బ్యాగ్‌ను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.  అయితే తమపై వస్తున్న దుష్ప్రచారాన్ని హీరో సందీప్‌ కిషన్‌ ఖండించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ లేఖ విడుదల చేశారు. హెడ్‌లైన్స్‌ పెట్టేముందు వాస్తవాలు కూడా తెలుసుకోవాలని ఆయన సూచించారు.

గత ఎనిమిదేళ్లుగా వివాహ భోజనంబు రెస్టారెంట్ పేరుతో మేము చాలా నమ్మకమైన సేవలు అందిస్తున్నామని సందీప్ కిషన్ రాసుకొచ్చారు. తమ హోటల్‌పై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవాలని అన్నారు. ముఖ్యంగా కొన్ని ఫోటోలు తమ కిచెన్‌కు సంబంధించినవి కావని అన్నారు. వేరే ఫోటోలు పెట్టి తమ కిచెన్‌ ఫోటోలుగా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

హోటల్‌లో 2022 నాటికే గడువు ముగిసిన 25 కిలోల చిట్టి ముత్యాల రైస్ బ్యాగ్‌ ఉన్నమాట నిజమే.. కానీ ఇప్పటివరకు సీల్‌ తీయలేదని సందీప్ కిషన్ తెలిపారు. అది కేవలం వెండర్‌ శాంపిల్‌ కోసం ఇచ్చిన రైస్ బ్యాగ్ అని వివరించారు. ఈ విషయాన్ని ఫుడ్ సెఫ్టీ అధికారులు ధ్రువీకరించారని అన్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో వస్తున్న కిచెన్‌ ఫోటోలు మా రెస్టారెంట్‌కు సంబంధించినవి కాదని వెల్లడించారు. చిన్నచిన్న పొరపాట్లను గుర్తించి.. వాటిని సరిదిద్దుకోవాలని అధికారులు సూచించినట్లు వివరించారు. ఎప్పటిలాగే ఫుడ్ సేఫ్టీ, టేస్ట్ విషయంలో క్వాలిటీ ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదని అన్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)