Breaking News

'రీ-రిలీజ్' ట్రెండ్.. ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువ!

Published on Sun, 08/20/2023 - 16:42

రీ-రిలీజ్ సినిమాలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రెండ్ ఇదే. ఈ హీరో- ఆ హీరో అని తేడా లేదు. పుట్టినరోజు వస్తుందంటే చాలు.. ఆయా హీరోల పాత మూవీస్‌ని థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు. అభిమానులతోపాటు సాధారణ ప్రేక్షకులూ వాటిని స్క్రీన్‌పై చూసి ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఈ ట్రెండ్ వల్ల ఇండస్ట్రీకి ప్లస్ కంటే మైనస్‌లే అనిపిస్తుంది.

వాళ్ల పైత్యం!
స్టార్ హీరోల ఫ్యాన్స్ అందరూ చెడ్డోళ్లు కాదు. కానీ వాళ్లలోని కొందరు మాత్రం అభిమానం అనే ముసుగు వేసుకుని ఎక్కడలేని పైత్యం బయటపెడుతున్నారు. ఉదాహరణకు చెప్పుకుంటే.. ఈ మధ్యే ప్రభాస్ 'యోగి' సినిమాని రిలీజ్ చేశారు. చాలామంది చూసి ఎంజాయ్ చేశారు. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్ లో సినిమా చూడటానికి వచ్చిన కొందరు మాత్రం.. ఖాళీ కూల్‌డ్రింక్ కేసులు విరగ్గొట్టారు. మరోచోట స్క్రీన్ చింపేశారు. ఇది నిజంగా పైత్యానికి పరాకాష్ట అని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: అప్పు ఎగ్గొట్టిన స్టార్ హీరో.. వేలానికి ఖరీదైన విల్లా!)

అందరూ అంతే!
అయితే అభిమాని అని చెప్పుకునే ఎక్కడలేని పైత్యం అంతా చూపించేది ఏదో ఓ హీరో ఫ్యాన్స్ మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే అందరు హీరోల ఫ్యాన్స్ అలానే తగలడ్డారు. ఎంజాయ్ చేయడానికి, పైత్యం చూపించడానికి మధ్య ఉన్న గీతని దాటేస్తున్నారు. వీళ్లు ఇలా చేయడం వల్ల పలు థియేటర్ యాజమానులు.. రీ రిలీజ్ సినిమాలంటేనే భయపడుతున్నారు.

లక్షల్లో నష్టం
రీ రిలీజ్‌ల వల్ల స్టార్ హీరోల సినిమాలకు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కుతున్నాయి.. ఈ వార్తల వల్ల థియేటర్ యజమానుల నష్టాలు పెద్దగా బయటకు రావట్లేదు. ఈ ట్రెండ్ దెబ్బకు థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఫ్యాన్స్ డ్యాన్స్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మైకంలో కుర్చీలు విరగ్గొట్టడం, స్క్రీన్ చించేయడం లాంటివి చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే.. వచ్చిన డబ్బుల కంటే పెట్టుబడే ఎక్కువవుతోంది.

(ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్‌-ఐశ్వర్య విడిపోయారా..?)

చిన్న సినిమాలకు దెబ్బ
తెలుగులో చిన్న సినిమాలకు ఉండే ఆదరణే అంతంత మాత్రం. టాక్ చాలా బాగుంటే తప్ప.. ప్రేక్షకులు థియేటర్ కి వచ్చి వాటిని చూడరు. అలాంటిది ఇప్పుడు ఈ రీ రిలీజ్ చిత్రాల వల్ల.. ప్రతివారం పలు చిన్న మూవీస్ విడుదలవుతున్నా ఆడియెన్స్ వాటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇలా రీ రిలీజ్ ట్రెండ్ వల్ల చిన్న సినిమాలు బలవుతున్నాయి.  

మరీ ఎక్కువైపోతున్నాయి!
రీ రిలీజ్ అనేది ఎప్పుడో ఓసారి చేస్తే.. ప్రేక్షకులకు కూడా ఓ సరదాలా ఉంటుంది. అదేదో ఉద్యమం.. పనిగట్టుకుని మరీ స్టార్ హీరోల సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే మాత్రం రెగ్యులర్ చిత్రాలు- పాత సినిమాలు.. ఇలా దేనిపై కూడా ఆసక్తి లేకుండా తయారైనా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి రీ రిలీజ్ ట్రెండ్‌కి ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో ఏంటో?

(ఇదీ చదవండి: జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌పై కేసు నమోదు)

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)