Breaking News

సినీ ఇండస్ట్రీని పెద్దలే తాకట్టు పెట్టారు: నట్టి కుమార్ సంచలన కామెంట్స్

Published on Wed, 05/03/2023 - 18:45

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీని అగ్ర హీరోలు, నిర్మాతలు రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రౌడీలకు, గూండాలకి అవార్డ్స్ ఇస్తున్నారని అశ్వనీదత్ మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు. రెండు రాష్ట్రాలు విడిపోయాక అవార్డ్స్‌కు విలువ పోయిందన్నారు. ప్రభుత్వం ముందు ఇండస్ట్రీని తాకట్టు పెట్టింది ఇండస్ట్రీ పెద్దలేనని ఆరోపించారు.

ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే వాళ్లు అప్పుడు అమరావతిలో భూములు తీసుకుంది వాస్తవం కాదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన తప్పును.. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి? చేయడని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వాన్ని అవార్డ్స్ గురించి అడిగే దమ్ముందా? అని నిలదీశారు.

(ఇది చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్)

ప్రత్యేక విమానాల్లో వెళ్లి అమరావతిలో ఇండస్ట్రీని తాకట్టుపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీ కోసం కాకుండా రాజకీయాల కోసం మాట్లాడడం సరైంది కాదని హితవు పలికారు. పార్టీలకతీతంగా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్‌డీసీ ఛైర్మన్ ఇండస్ట్రీ పెద్దల్ని కలిసి మాట్లాడాలని సూచించారు. 

నట్టి కుమార్ మాట్లాడుతూ.. ' ల్యాండ్స్ తీసుకున్న సినీ పెద్దలు స్టూడియోలు ఎందుకు నిర్మించట్లేదు.? స్టూడియోలు ఏర్పాటు చేస్తే ఉద్యోగావకాశాలు లభిస్తాయి కదా. తెలంగాణలో 2014లో రూ.20 వేలు రెంట్ ఉంటే... ఇప్పుడు లక్షన్నర ఉంది. తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేస్తా అని మాత్రమే అంటోంది. కానీ చిన్న సినిమాలకి చేస్తోంది ఏమి లేదు.'  అని అన్నారు.

చిన్న సినిమాల గురించి మాట్లాడుతూ.. '2014 నుంచి చిన్న సినిమా చచ్చిపోయింది. రెండు రాష్ట్రాలలో 2014 నుంచి స్టూడియోల నిర్మాణానికి ఎవరికి అనుమతులు లేవు. చిన్న, పెద్ద అందరూ కలిస్తేనే ఇండస్ట్రీ. పెద్దల్ని కలవలేక పోతున్నాం. అందుకే మీడియా ముందుకు వచ్చాను. దాసరి నారాయణరావు ఇండస్ట్రీకి ఎంతో చేశారు. కానీ ఆయన చనిపోయాక ఎవరు పట్టించుకోవడం లేదు. రెండు ప్రభుత్వాలు దాసరి కోసం ఏదైనా చేస్తే బాగుంటుంది. దాసరి విజ్ఞాన పార్క్ పెట్టాలని కోరుతున్నా. ఆయనను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది.' అని అన్నారు. 

(ఇది చదవండి: నరేశ్- పవిత్ర 'మళ్లీ పెళ్లి'.. ముహుర్తం పెట్టేశారుగా!)


 

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)