అప్పుడే చనిపోయేవాడిని.. తన వల్లే ఇప్పటికీ బతికున్నా..: నిర్మాత కోన వెంకట్

Published on Wed, 04/01/2026 - 07:10

టాలీవుడ్ నిర్మాత కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. చెన్నైల్లో ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుందామని బీచ్‌కు వెళ్లానని తెలిపారు. కానీ అక్కడ ఓ అమ్మాయి తన జీవితాన్ని కాపాడిందని అన్నారు. రెండు కాళ్లు, చేతులు లేని అమ్మాయిని చూసి నా నిర్ణయం మార్చుకున్నాని వెల్లడించారు. రేపు అనేది తెలియని ఆ అమ్మాయి.. వాళ్ల తమ్ముడు బండి తోస్తుంటే బెలూన్స్‌ అమ్ముతూ బతికినప్పుడు.. నేను ఎందుకు బతకలేనని అనుకున్నానని కోన వెంకట్‌ తెలిపారు. నా కోసం ఆ దేవుడే ఆ అమ్మాయిని పంపించాడని అనుకుంటానని ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

ఈ సంఘటన 1997లో జరిగిందని కోన వెంకట్ చెప్పారు. ఒక 50 నిద్రమాత్రలు తీసుకుని.. నా దగ్గర ఉన్న చివరి డబ్బులతో వాటర్ బాటిల్ తీసుకున్నానని తెలిపారు. ఆ అమ్మాయి నాకు కనిపించి ఉండకపోతే ఈ రోజు కోన వెంకట్ అనేవాడు లేడన్నారు. ఆ తర్వాత నేను చాలా సినిమాలకు కథలు రాశానని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చాలాసార్లు అమ్మాయి కనిపిస్తుందేమోనని బీచ్‌లో వెతుక్కుంటూ వెళ్లానని అన్నారు. కానీ ఎక్కడా కూడా మళ్లీ ఆ అమ్మాయి కనిపించలేదన్నారు. బ్యాండ్‌మేళం థ్యాంక్ యూ మీట్‌కు హాజరైన కోన వెంకట్‌ తన చేదు అనుభవాన్ని అభిమానులతో పంచుకున్నారు. 

కోర్ట్ ఫేమ్‌ హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన చిత్రం బ్యాండు మేళం. ఈ మూవీకి సతీష్‌ జవ్వాజీ దర్శకత్వం వహించారు. మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మించారు. ఈ సినిమాను మార్చి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

 

Videos

కొంచమైనా సిగ్గు ఉందా? ఈనాడు పిచ్చి రాతలపై దాడిశెట్టి రాజా ఆగ్రహం

పశ్చిమాసియాలో హైఅలర్ట్.. కువైట్ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ ను పేల్చేసిన ఇరాన్

వైఎస్ జగన్‌ను కలిసిన గురజాల నియోజకవర్గ స్థానిక నేతలు

బీజేపీలో చేరిన టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్

అమెరికాపై యుద్ధం ఎఫెక్ట్ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

అమరావతి చట్టబద్దత పేరుతో బాబు డైవర్షన్ పాలిటిక్స్

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై, YSRCP రౌండ్ టేబుల్ సమావేశం

సినీ ఇండస్ట్రీ పై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఈవారం ఇన్వెస్టర్లకు పండగే.. బోనస్, స్టాక్ స్ప్రిట్, డివిడెండ్లు కుమ్మరించనున్న స్టాక్స్ ఇవే..!

అంబులెన్సును తోస్తున్న పోలీసులు

Photos

+5

'పల్లి చట్టంబి' మూవీ ప్రెస్ మీట్ (ఫొటోలు)

+5

‘బ్యాండ్‌ మేళం’ మూవీ థ్యాంక్ యూ మీట్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఘనంగా భగవాన్‌ మహావీర్‌ జయంతి వేడుకలు (ఫొటోలు)

+5

పైలట్‌ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ జనని (ఫొటోలు)

+5

భార్యతో కలిసి హీరో నితిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మార్చి నెల జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ (ఫొటోలు)

+5

రాకాస ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మెరిసిన నీహారిక.. (ఫొటోలు)

+5

బెంగళూరు : కనువిందుగా హారతి దీపాల వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్: మధ్యాహ్నం భానుడి భగభగలు.. సాయంత్రం వరుణుడి పలకరింపు (ఫొటోలు)

+5

‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)