Breaking News

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ ధరల పెంపు.. దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్!

Published on Wed, 06/11/2025 - 21:18

టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్‌ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో మార్పు రావాలని ఆయన అన్నారు. నా సినిమాలకు టికెట్ ధరలు పెంచను.. అలాగే ఇప్పుడు తమ్ముడు చిత్రానికి ధరలు పెంచమని ప్రభుత్వాలను అడగనని స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటించిన తమ్ముడు ట్రైలర్ ఈవెంట్‌లో దిల్‌ రాజు మాట్లాడారు. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో తమ్ముడు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు టిక్కెట్ల పెంపు అంశంపై కామెంట్స్ చేశారు.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం నిర్మాతల బాధ్యత అని.. టికెట్ ధరలు, తినుబండారాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదని.. తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలోనూ చర్చించామని దిల్‌ రాజు పేర్కొన్నారు. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కల్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్‌ రాజు అన్నారు. ఆయన సూచనలను నిర్మాతలంతా తప్పకుండా పాటించాలని కోరారు.

కాగా.. టాలీవుడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం తమ్ముడు. ఈ సినిమాకు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ  హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ ద్వారా లయ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీష్ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన తమ్ముడు సినిమా జూలై 4న థియేటర్లలో విడుదల కానుంది.
 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)