'అందుకే బన్నీ గడ్డం ట్రిమ్‌ చేశాడు'.. సుకుమార్‌తో గొడవపై టాలీవుడ్ నిర్మాత!

Published on Fri, 07/19/2024 - 19:59

ఐకాన్ ‍స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం పుష్ప-2: ది రూల్. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన పుష్పకు సీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ వాయిదా పడిన నేపథ్యంలో ఈ సినిమాపై రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. హీరో, డైరెక్టర్‌ మధ్య గ్యాప్ వచ్చిందని.. అందుకే షూటింగ్ సైతం ఆలస్యమవుతోందని పలురకాల వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా పుష్ప-2పై వస్తున్న రూమర్స్‌పై నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ఆయ్‌ మూవీ ప్రెస్‌మీట్‌కు హాజరైన ఆయనకు ఈ ప్రశ్న ఎదురుకావడంతో క్లారిటీ ఇచ్చారు.  పుష్ప-2పై మీడియాలో వార్తలు చూస్తే నవ్వు వస్తోందని అన్నారు. అల్లు అర్జున్  పార్ట్ కేవలం 15 నుంచి 20రోజుల లోపే ఉందని తెలిపారు. ఎడిటింగ్‌ అ‍య్యాక.. ఇంకా ఏమైనా అల్లు అర్జున్‌ పార్ట్‌ బ్యాలెన్స్‌ ఉంటే అప్పుడు షూటింగ్‌ పెట్టుకుందామని సుకుమార్ అన్నారని వివరించారు.

అందుకే బన్నీ తన గడ్డాన్ని ట్రిమ్‌ చేసుకున్నారని వెల్లడించారు. బన్నీ-సుకుమార్‌ మధ్య బాండింగ్‌ ఎప్పటికీ అలానే ఉంటుందని పేర్కొన్నారు. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్‌  మొదలవుతుందని స్పష్టం చేశారు. పుష్ప లాంటి పాన్ ఇండియా సినిమాను ఇంత సింపుల్‌గా ఎందుకు తీసుకుంటార నిర్మాత బన్నీ వాస్ ప్రశ్నించారు. కాగా.. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న పుష్ప-2.. ఈ ఏడాది డిసెంబర్‌ 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Videos

26నుంచి భారీ వర్షాలు

మహిళల జుట్టు పట్టుకోవడం, చీరలు లాగడం ఏ రకమైన పాలనకు నిదర్శనం?

దాడుల వెనుక టార్గెట్.. రెడ్డి వర్గం..! ఇంద్రనీల్ సంచలన నిజాలు

ముంచుకొస్తున్న అర్ణబ్ తుపాను

ఎల్లో మూకలపై శివంగుల్లా తిరగబడ్డ మహిళలే మాకు స్ఫూర్తి

నేడు భారత్ -న్యూజిలాండ్ మధ్య రెండో T20 మ్యాచ్

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)