Breaking News

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌కు షాక్..!

Published on Thu, 07/23/2026 - 17:05

టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్‌కు షాక్ తగిలింది. నిర్మాత వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ఈ కేసులో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్ కొట్టేసింది. దీంతో బండ్ల గణేశ్‌కు సుప్రీంలో చుక్కెదురైంది. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాతో జరుగుతున్న రుణ వివాదంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సర్ఫేసీ, ఐబీసీ చట్టాలకు సంబంధించిన కీలక అంశాలపై అత్యున్నత న్యాయస్థానంలో ఆయన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అసలేం జరిగిందంటే..

హైదరాబాద్‌లోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీఫామ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఇచ్చిన రుణాలకు సంబంధించి బండ్ల గణేష్, ఆయన కుటుంబ సభ్యులు తమ వ్యక్తిగత ఆస్తులను పూచీకత్తుగా పెట్టిన సంగతి తెలిసిందే. కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రిజల్యూషన్‌ ప్రాసెస్‌ సమయంలో, బ్యాంక్‌ సర్ఫేసీ చట్టం కింద చర్యలు చేపట్టి తనఖా పెట్టిన ఆస్తుల్లో ఒకదానిని వేలం వేసింది. అయితే, ఈ వేలం ప్రక్రియను, సేల్‌ సర్టిఫికెట్‌ను హైదరాబాద్‌లోని రుణ వసూళ్ల ట్రిబ్యునల్‌ (డీఆర్‌టీ) తప్పుబట్టింది. కొనుగోలుదారుడికి వడ్డీతోసహా డబ్బును వాపసు చేయాలని, పిటిషనర్లకు ఆస్తిని తిరిగి అప్పగించాలని ఆదేశించింది. అయితే, డీఆర్‌టీ ఇచ్చిన ఈ తీర్పును హైకోర్టు కొట్టివేసింది.

వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద బ్యాంక్‌ రూ.71.44 కోట్లతో సహా సుమారు రూ.129.02 కోట్లను రికవరీ చేసిందని, బకాయిలు పూర్తిగా తీరిపోయినట్లు సెటిల్‌మెంట్‌ సర్టిఫికెట్‌ కూడా ఇచ్చిందని బండ్ల గణేష్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. మరోవైపు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఆస్తిని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్‌ దాఖలు చేశారు. 
 

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)