Breaking News

నీ ఫ్యూచర్ ఏంటో ముందే తెలిస్తే?.. ఆసక్తిగా ట్రైలర్

Published on Fri, 12/27/2024 - 18:45

ప్రశాంత్ కృష్ణ, అనీషా దామా,  శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య హోళక్కల్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం డ్రీమ్ క్యాచర్. ఈ సినిమాకు సందీప్ కాకుల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను సియల్ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు. సైకలాజికల్ థ్రిల్లర్‌గా వస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 3న విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా డ్రీమ్ క్యాచర్ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే మన జీవితంలో జరగబోయేది ముందే తెలిస్తే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో  శ్రీనివాస్ రామిరెడ్డి, ఐశ్వర్య కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి రోహన్ శెట్టి సంగీతమందిస్తున్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సందీప్ కాకుల మాట్లాడుతూ..' సినిమా చేయాలనేది నా డ్రీమ్. కలల మీద సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో ఈ  మూవీ మొదలైంది. ఇన్‌సెప్షన్‌ లాంటి హాలీవుడ్ మూవీస్ నాకు ఆదర్శంగా నిలిచాయి. ఒక హాలీవుడ్ స్థాయి అటెంప్ట్ చేయాలని అనుకున్నా. సినిమా మొత్తం హైదరాబాద్‌లోనే చేశాం. ట్రైలర్, పోస్టర్స్ చూసి ఈ మూవీ ఎక్కడ షూటింగ్ చేశారని అడుగుతున్నారు. కలల నేపథ్యంగా ఇలాంటి సినిమా ఇప్పటిదాకా తెలుగులో రాలేదని చెప్పగలను. గంటన్నర నిడివితో ఉన్న ఈ సినిమాలో ఎలాంటి పాటలు, ఫైట్స్ ఉండవు. కేవలం కథ మీదనే మూవీ నడుస్తుంది. నా టీమ్ అంతా ఎంతో బాగా సపోర్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్ చేస్తున్నాం' అని అన్నారు.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)