Breaking News

బాక్సాఫీస్ బరిలో దీర్ఘాయుష్మాన్ భవ.. రిలీజ్‌ డేట్‌ ఫిక్స్

Published on Mon, 07/07/2025 - 16:44

కార్తీక్‌రాజు, నోయల్ ,మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం "దీర్ఘాయుష్మాన్ భవ". ఈ సినిమాకు  ఎం.పూర్ణానంద్  దర్శకత్వం వహించారు.  త్రిపుర క్రియేషన్స్ పతాకంపై నిర్మాత వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. ఈ చిత్రం ట్రైలర్, పాటలను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కార్యక్రమంలో రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి కె.ఎల్.దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..'కొత్త నిర్మాతలకు చిత్ర పరిశ్రమ ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. అయితే కొత్త నిర్మాతలు చిత్ర పరిశ్రమ మీద కనీసం ఒక ఏడాది పాటు అవగాహన పెంచుకుని వస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ తరపున మేము ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నాం. పెద్ద, చిన్న సినిమాల సమస్యలు, సాధ్యాసాధ్యాల  గురించి  ఛాంబర్‌లో చర్చించబోతున్నాం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే, మంచి అభిరుచితో, మంచి కాంబినేషన్ ఆర్టిస్టులతో ఈ సినిమా తీసినట్లు అనిపిస్తోంది. తప్పకుండా ఈ చిత్రం  ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నా" అని అన్నారు.

నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. "చిన్న సినిమాల సమస్యలను తీర్చేందుకు ఇటు పరిశ్రమ, అటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. మల్టీ ఫ్లెక్స్‌ల్లో పేదవాడు సినిమా చూసే విధంగా ఆక్యుపెన్సీలో 20 శాతం టిక్కెట్ రేట్లను 75 రూపాయలుగా నిర్ణయించాలి. ఫామిలీ అంతా కూర్చుని హాయిగా చూసుకునేలా ఈ చిత్రం ఉంటుంది" అని అన్నారు.  చిత్ర దర్శకుడు ఎం.పూర్ణానంద్ మాట్లాడుతూ.. "ఫ్యామిలీ ప్యాక్ చిత్రమిది. అందరినీ ఆహ్లదపరిచే కామెడీ, ఉంది. సోసియో ఫాంటసీగా దీనిని మలిచాం" అని తెలిపారు. ఈ చిత్రంలో ఆమని,  కాశీ విశ్వనాధ్,  పృథ్వీరాజ్‌, సత్యం రాజేష్, గెటప్ శ్రీను , తాగుబోతు రమేష్, జె మిని సురేష్‌, నోయల్, గుండు సుదర్శన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వినోద్ సంగీతమందించారు. ఈ చిత్రం ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి