Breaking News

సీఎంతో సినీ పెద్దల భేటి.. దిల్‌ రాజు ప్లాన్‌ బెడిసికొట్టిందా?

Published on Thu, 12/26/2024 - 15:06

సంధ్య థియేటర్‌ ఘటనతో తెలంగాణ ప్రభుత్వం కన్నెర్ర చేయడంతో తెలుగు పరిశ్రమలో అలజడి మొదలైంది.  ఇండస్ట్రీని టార్గెట్‌ చేస్తూ ప్రజాప్రతినిధులు పదునైన కామెంట్లు చేస్తున్నా సరే ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి రెస్పాన్స్‌ రాలేదు. భవిష్యత్‌లో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు అనేది ఉండదని అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చిత్ర పరిశ్రమకు మధ్య దూరం పెరుగుతుందనే వాదన అందరిలోనూ మొదలైంది. మరోవైపు సంక్రాంతికి భారీ సినిమాలు రానున్నాయి. ఇందులో మెగా హీరో రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ చిత్రం కూడా ఉంది. ఈ మూవీ కోసం నిర్మాత దిల్‌ రాజు భారీ బడ్జెట్‌ పెట్టారు. ఈ సినిమా విడుదల విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పవచ్చు.

కొద్దిరోజుల క్రితం ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా దిల్‌రాజు నియామకం అయ్యాక పుష్ప చేసిన డ్యామేజీకి ‘గేమ్‌ ఛేంజర్‌’ అవుతారని అందరూ భావించారు. దానిని నిజం చేస్తూ.. తెలంగాణ ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు తాను మధ్యవర్తిగా ఉంటానని ఆయన అన్నారు. అందులో భాగంగానే అమెరికా నుంచి రాగానే సీఎం రేవంత్‌తో ఆయన సమావేశం అయ్యారు. చిత్రసీమ అభివృద్ధికి, సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చే అంశంపై తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆ సమయంలో దిల్ రాజు ప్రకటించారు. స్వయంగా ముఖ్యమంత్రితో మాట్లాడి బయటకొచ్చిన తర్వాత దిల్ రాజు ఇచ్చిన స్టేట్ మెంట్ కావడంతో గేమ్‌ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉంటాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

తాజాగా ఇండస్ట్రీ సమస్యల పేరుతో సీఎం రేవంత్‌తో సినీ పెద్దల మీటింగ్‌ను దిల్‌రాజ్‌ ఏర్పాటు చేశారు.  తెలంగాణలో బెనిఫిట్‌షోలు, టికెట్ల రేట్లు పెంపు ఉండదని సీఎం ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్‌ మొదట గేమ్‌ ఛేంజర్‌ మీద పడుతుందని దిల్‌ రాజు భావించారు. ఈ భేటీతో గేమ్‌ ఛేంజర్‌కు ప్రత్యేక అనుమతులు పొందవచ్చని ఆయన అడుగులు వేసినట్టు కనబడింది. ఈ సినిమా కోసం కోట్ల రూపాయలు దిల్‌ రాజు బడ్జెట్‌ పెట్టారు. గేమ్‌ ఛేంజర్‌కు బెనిఫిట్‌షోలు, టికెట్ల ధరలు పెంపు లేకుంటే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి ఎలాగైనా సరే బయటపడేందుకు సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించేందుకు ఆయన ప్రయత్నం చేశారని తెలుస్తోంది.

తాజాగా సీఎంతో జరిగిన సమావేశంలో టికెట్ల రేట్లు పెంపుతో పాటు బెనిఫిట్‌షోల గురించి కూడా చర్చ వచ్చిందట. అయితే, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం తాను అసెంబ్లీలో చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటున్నానని.. అందులో తగ్గేదే లేదని ఆయన అన్నారట. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా సీఎంను ఒప్పించే ప్రయత్నం చేశారట. అయినప్పటికీ,  ఇకపై బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్ రేట్ల పెంపు ఉండదని రేవంత్‌ క్లియర్‌గా చెప్పేశారట. అంతే కాదు ప్రీరిలీజ్‌లు, సినిమా ఫంక్షన్లు, అభిమానుల గేదరింగులకు అనుమతులు ఉండాలంటే పక్కాగా నిబంధనలు పాటించాలని చెప్పారట. సినిమా పెద్దలు ఎంత ప్రయత్నించినా సీఎం రేవంత్‌ మాత్రం ‘తగ్గేదే లే’ అన్నారని సమాచారం. మొత్తానికి సీఎం రేవంత్‌ పైచేయి సాధించారని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)