Breaking News

రెండేళ్లుగా ఆ పద్ధతినే పాటిస్తున్నా.. అదే నా గేమ్ ఛేంజర్: సమంత

Published on Thu, 01/23/2025 - 15:40

టాలీవుడ్ హీరోయిన్ సమంత చివరిసారిగా సిటాడెల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. ఇందులో వరుణ్ ధావన్ సరసన మెప్పించింది. అయితే ప్రస్తుతం పెద్దగా సినిమాల్లో కనిపించకపోయినా సోషల్ మీడియాలో టచ్‌లోనే ఉంటోంది. ప్రస్తుతం ఆధ్యాత్మిక బాటలో ఫుల్ బిజీగా ఉంది. గతంలో చాలాసార్లు ఇషా ఫౌండేషన్‌కు వెళ్లిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

అయితే తాజాగా సామ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత రెండేళ్లుగా తాను ఓ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నట్లు తెలిపింది. ఇది తన కష్టతరమైన క్షణాల నుంచి బయపడేసిందని వెల్లడించింది. అంతేకాదు ఇది చాలా సులభమైన, శక్తివంతమైందని సామ్ అంటోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

సమంత తన ఇన్‌స్టాలో రాస్తూ..'నేను గత రెండు సంవత్సరాలుగా ఈ చిన్న ఆచారాన్ని పాటిస్తున్నా. ఇది నా కష్టతరమైన క్షణాల నుంచి ఉపశమనం కలిగించింది. ఇది చాలా సులభమైంది.. అంతే కాదు శక్తివంతమైనది కూడా. ప్రస్తుత ఎక్కడ ఉన్నాను.. అలాగే మున్ముందు ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీరు కాస్తా సాఫ్ట్‌గా అనిపిస్తుందని నాకు తెలుసు. కానీ అది నిజం కాదు.. ఇది మీకు సహాయపడుతుందని నిరూపించడానికి తన వద్ద తగినంత సమాచారం ఉంది' రాసుకొచ్చింది.

సామ్ తన పోస్ట్‌లో.. 'రైటింగ్ అనేది మీకు సహజంగా వచ్చినట్లయితే.. ఈ రోజు మీరు కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాలను రాయండి. అవి పెద్దవిగా ఉండాల్సిన అవసరం లేదు. కేవలం నిజాయితీగా ఉండాలి. కానీ రాయడం కష్టంగా, బలవంతంగా అనిపిస్తే మీరు బాగా విశ్వసించే వారితో షేర్ చేయండి. అంతే కాదు ఏమీ చేయకపోయినా కొన్నిసార్లు సైలెంట్‌గా కూర్చున్నా చాలు. ఈ చిన్న అభ్యాసం మొదట చాలా సింపుల్‌గా అనిపించవచ్చు. కానీ  ప్రతిదీ మీరు చూసే విధానాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఒకసారి ప్రయత్నించండి. ఇది నాకు గేమ్ ఛేంజర్‌గా మారింది.' రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)