Breaking News

' సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు సమస్య లేదు'.. పూనమ్ కౌర్‌ ట్వీట్‌ వైరల్

Published on Thu, 12/26/2024 - 21:29

హీరోయిన్ పూనమ్ కౌర్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రితో జరిగిన టాలీవుడ్ సినీ ప్రముఖుల భేటీపై స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. సీఎం రేవంత్‌ రెడ్డితో టాలీవుడ్‌ సినీ పెద్దలు భేటీ కావడంపై తనదైన శైలిలో పోస్ట్ చేసింది. ముఖ్యమంత్రితో కలిసేందుకు వెళ్లిన వారిలో ఇండస్ట్రీ నుంచి ఒక్క మహిళ కూడా లేకపోవడంపై ట్విటర్‌ వేదికగా ప్రశ్నించింది.

మన టాలీవుడ్‌ సినీ ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యలు లేవని పూనమ్ కౌర్‌ ట్వీట్‌ చేసింది. కేవలం హీరోలకు, బిజినెస్‌ గురించి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే ఇండస్ట్రీ అండగా ఉంటుందని ట్విటర్‌లో రాసుకొచ్చింది. తాజా పరిస్థితి చూస్తే ఇండస్ట్రీలో ఏ ఒక్క మహిళకు ఎలాంటి సమస్యలు లేవని అర్థమవుతోందని వ్యంగ్యంగా ట్వీట్ చేసింది.

కాగా.. సంధ్య థియేటర్‌ ఘటన తర్వాత టాలీవుడ్ సినీ పెద్దలు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డితో భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎంతో దిల్‌ రాజు, అల్లు అరవింద్, నాగార్జున, త్రివిక్రమ్, వెంకటేశ్ లాంటి ప్రముఖులంతా సమావేశమయ్యారు. ఈ భేటీలో సినీ ఇండస్ట్రీలో సమస్యలపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇండస్ట్రీ తరఫున ఏ ఒక్క మహిళ డైరెక్టర్‌ కానీ, నటి కానీ పాల్గొనలేదు. దీన్ని ఉద్దేశించే నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)