Breaking News

వివాహబంధంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫోటోలు వైరల్!

Published on Sun, 09/15/2024 - 11:21

టాలీవుడ్‌ హీరోయిన్ మేఘా ఆకాశ్ పెళ్లిబంధంలోకి అడుగుపెట్టింది. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ముద్దుగుమ్మ సాయివిష్ణు అనే వ్యక్తితో ఏడడుగులు వేసింది. తాజాగా తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంది. ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్ అంటూ భర్తతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. చెన్నైలో జరిగిన ఈ వేడుకలో పలువురు సినీతారలు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

చెన్నైలో జరిగిన మేఘా ఆకాష్, సాయివిష్ణు వివాహ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. 

meghaha

( ఇది చదవండి: పెళ్లి పనులు మొదలుపెట్టేసిన హీరోయిన్.. మెహందీ ఫొటోలు)

కాగా.. నితిన్ 'లై' సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది మేఘా ఆకాశ్. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా కొన్ని మూవీస్ చేసింది. తెలుగులో 'లై'తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది. కోలీవుడ్‌లో 2019లో పెట్టా మూవీతో ఎంట్రీ ఇచ్చిన మేఘా ఆకాశ్.. ఎన్నై నోకి పాయుమ్ తోట, వంద రాజావ తాన్ వరవానే చిత్రాల్లో  హీరోయిన్‌గా నటించింది. అంతేకాకుండా సబానాయగన్, వడకుపట్టి రామసామి సినిమాలతో మెప్పించింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)