Breaking News

ఈ సినిమాతో నా డ్రీమ్ నెరవేరింది: మీనాక్షి చౌదరి

Published on Wed, 11/20/2024 - 18:42

టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్‌ నటిస్తోన్న 'సంక్రాంతి వస్తున్నాం'. వెంకీ- అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం పొంగల్ బరిలో నిలిచింది. ఈ ఈ ట్రయాంగిల్‌ క్రైమ్‌ డ్రామా ఫిల్మ్‌లో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మాజీ పోలీసాఫీసర్‌ పాత్రలో వెంకటేశ్‌ కనిపించనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యట్రిక్ చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ టీమ్ రిలీజ్‌ డేట్‌ ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించారు మేకర్స్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌లో పాల్గొన్న హీరోయిన్ మీనాక్షి చౌదరి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. అదేంటో మీరు చూసేద్దాం.

మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..'ఇది ఒక డ్రీమ్ క్యారెక్టర్. నాకు చిన్నప్పటి నుంచి మూడు డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి డాక్టర్, రెండు మిస్ ఇండియా, మూడోది ఐపీఎస్ ఆఫీసర్. ఫస్ట్ రెండు కోరికలు నెరవేరాయి. ఈ మూవీతో నా మరో డ్రీమ్ కూడా ఫుల్‌ఫిల్ అయింది. ఈ అవకాశమిచ్చిన అనిల్ రావిపూడి సార్‌కు థ్యాంక్స్‌.' అని అన్నారు.

కాగా.. ఇటీవల టైటిల్‌ ప్రకటించిన మేకర్స్ తాజాగా మూవీ విడుదల తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు వెంకటేశ్ గన్ చేతిలో పట్టుకుని.. పంచకట్టులో కనిపిస్తోన్న ఫోటోను షేర్ చేశారు. 'సంక్రాంతికి వస్తున్నాం.. విక్టరీ వినోదాన్ని పంచుతున్నాం' అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా.. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతమందిస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)