Breaking News

ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా మారదాం: రామ్ చరణ్

Published on Thu, 06/26/2025 - 19:27

తెలంగాణ ప్రభుత్వం చేస్తోన్న కృషికి టాలీవుడ్ నుంచి పూర్తి సహకారం అందిస్తామని ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, సినీ నిర్మాత దిల్‌రాజు అన్నారు. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మలయాళ చిత్ర పరిశ్రమలాగే మనం కూడా ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడేవారిపై నిషేధం విధించేలా సినీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన టాలీవుడ్ హీరోలు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ డ్రగ్స్‌ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు.

రామ్ చరణ్ మాట్లాడుతూ..' మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక మంచి హై..  ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపితే అది మంచి హై.. ఈవెనింగ్ స్పోర్ట్స్ ఆడి ఫ్రెష్ అయితే అది ఒక మంచి హై.. గోపిచంద్ చెప్పినట్లు ఆ హై వేరు.. మనల్ని మనమే రక్షించుకుందాం.. డ్రగ్స్‌కి యువత దూరంగా ఉండాలి.. జీవితాలని పాడుచేసుకోకూడదు.. మన సోసైటీ మనమే క్లీన్ చేసుకుందాం. గతంలో కొన్ని స్కూల్స్‌ బయట డ్రగ్స్‌ అమ్ముతున్నారని తెలిసి బాధేసింది. అప్పుడు నేను తండ్రిని కాదు. ఇప్పుడు నేను కూడా ఒక తండ్రిని. ఒక విజయవంతమైన సినిమా చేసినప్పుడు ఎంతో గర్వంగా ఉంటుంది. మన కుటుంబంతో మొదలు పెట్టి స్కూల్‌, సమాజం బాగుచేసుకుందాం. ఈ విషయంలో పోలీస్‌శాఖ కృషిని ప్రశంసిస్తున్నా. ప్రతి ఒక్కరూ ఒక్కో సైనికుడిలా మారదాం.. డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం' అని పిలుపునిచ్చారు.


విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ.. 'ఒక్కసారి ట్రై చేయిరా అనే వాళ్లు ఉంటారు. కానీ ఒక్కసారి అటువైపు వెళ్తే ఇక బయటపడటం కష్టం. ఎవరైనా మనకు అలాంటి వాళ్లు కనపడితే వారికి దూరగా ఉందాం. జిమ్‌లో మంచి వర్కవుట్ చేస్తే మంచిగా అనిపిస్తది. నాకు డబ్బులు సంపాదించినప్పుడు ఒక హై వస్తది. డబ్బులు ఇంకొకరికి ఇచ్చి హెల్ప్ చేస్తున్నప్పుడు ఒక హై వస్తది.  నచ్చిన పని చేస్తున్నప్పుడు ఒక హై వస్తది. నచ్చిన పని చేసి సక్సెస్ అందుకున్నప్పుడు ఒక హై వస్తది. ఛేజ్ ది సక్సెస్ ... డ్రగ్స్ వంటి నెగిటివిటీకి దూరంగా ఉండండి. మిమ్మల్ని చూసి మీ పేరేంట్స్ గర్వపడతారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు వస్తది. అందుకే మన డ్రగ్స్‌కి దూరంగా ఉందాం. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మిద్దాం. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని అన్నారు.

 

Videos

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)