Breaking News

సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారు: విశ్వక్ సేన్

Published on Fri, 05/31/2024 - 21:59

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్‌, నేహా శర్మ నటించిన చిత్రం 'గ్యాంగ్స్ ఆఫ్‌ గోదావరి'. అభిమానుల భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం విడుదలైంది. ఈ సినిమాకు మొదటి రోజే పాజిటివ్‌ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు హిట్‌ టాక్ రావడంతో హీరో విశ్వక్ సేన్‌, డైరెక్టర్‌ కృష్ణచైతన్య ప్రెస్‌ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రివ్యూలపై విశ్వక్‌ సేన్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమా చూడకుండానే రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించారు.

 విశ్వక్‌ సేన్ మాట్లాడుతూ..' బుక్‌ మై షో వాళ్లు ఇలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. టికెట్‌ కొన్నవారికే రివ్యూ ఇచ్చేలా ఉండాలి. కానీ ఇక్కడ ఎంతమంది ఇచ్చినా తెలిసిపోతుంది.  ఎవరో పని గట్టుకొని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎవరు ఇలా చేస్తున్నారో తెలియడం లేదు. సినిమాకి సంగీతం బాగాలేదని కొందరు రివ్యూల్లో రాశారు. అక్కడే  వారు మూవీ చూడలేదని అక్కడే అర్థమైపోయింది. ఈ సినిమాలో మ్యూజిక్ అద్భుతంగా ఉంది. చూడకుండానే ఉదయం ఐదారు గంటలకే రివ్యూ ఇచ్చారు. సినిమాలో వీక్‌ పాయింట్‌ని సమీక్షించడంలో తప్పులేదు.' అని అన్నారు. కాగా.. ఇటీవలే మూవీ రిలీజైన వారానికి రివ్యూలు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై టాలీవుడ్‌లో చర్చ జరిగిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఈ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని డైరెక్టర్‌ కృష్ణచైతన్య స్పష్టం చేశారు. కథ సిద్దమయ్యాక అన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. పవర్‌ పేట గురించి త్వరలోనే అప్‌డేట్‌ ఇస్తామన్నారు. 
 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)