Breaking News

అమ్మ కోరిక తీర్చిన విజయ్ దేవరకొండ.. ఇంతకీ అదేంటో తెలుసా?

Published on Fri, 05/16/2025 - 21:04

రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్‌ మూవీతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్‌కు అభిమానుల అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా విజయ్ దేవరకొండతో కెమిస్ట్రీ ఫుల్ రొమాంటిక్‌గా సెట్ అయింది. అయితే ఈనెల 30న థియేటర్లలో విడుదల కావాల్సిన కింగ్‌డమ్‌ ఊహించని విధంగా వాయిదా పడింది. ఇండియా- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కింగ్‌డమ్ మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  జూలై 4న సినిమా థియేటర్లలోకి రానుందని వెల్లడించారు.

ఇక సినిమాల సంగతి పక్కనపెడితే విజయ్ తన ఫ్యామిలీతో చాలా సరదాగా గడుపుతూ ఉంటారు. ఎక్కడికెళ్లినా సోషల్ మీడియాలో వేదికగా ఫోటోలు షేర్ చేస్తుంటారు. తాజాగా విజయ్ దేవరకొండ తన తల్లి కోరికను తీర్చాడు. ఈ వీకెండ్‌లో డిన్నర్‌ బయట ప్లాన్ చేద్దామని అమ్మ కోరడంతో వెంటనే విజయ్ డిన్నర్‌ ప్లాన్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అమ్మానాన్న, తమ్ముడు ఆనంద్‌తో డిన్నర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

(ఇది చదవండి: అటు రొమాన్స్.. ఇటు యాక్షన్.. 'కింగ్డమ్' తొలి పాట చూశారా?)

విజయ్ తన పోస్ట్‌లో రాస్తూ..'అమ్మ అకస్మాత్తుగా మనం డిన్నర్ కి బయటకు వెళ్దామని అడిగింది. మేము బయటకు వెళ్లి చాలా కాలం అయింది. మనమందరం ఎప్పుడూ పని, లక్ష్యాల వెంట పరిగెడుతుంటాం. పనిలో బిజీగా ఉంటూ కొన్నిసార్లు జీవించడం మర్చిపోతాం.  అందుకే నిన్న రాత్రి మేము బయటకు వెళ్లి చాలా సమయం గడిపాం. మీరు కూడా మీ అమ్మ, నాన్నలతో సమయం గడపడం మర్చిపోవద్దు. వారిని బయటకు తీసుకెళ్లండి, వారికి కొన్ని కౌగిలింతలు, ముద్దులు ఇవ్వండి. మీరు వారిని ప్రేమిస్తున్నారని చెప్పండి. మీ అందరికీ, మీ కుటుంబాలకు చాలా ప్రేమను పంపుతున్నా' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)