Breaking News

'వాళ్లిద్దరు లేకపోతే ఇండస్ట్రీలో లేను..': వరుణ్ సందేశ్

Published on Tue, 07/21/2026 - 20:18

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్‌లో బక్క పలచని కుర్రాడిలా అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా మెప్పించారు. ప్రస్తుతం  వరుణ్‌ సందేశ్ నటిస్తోన్న మూవీ  బ్లాక్‌మెయిల్‌. ఈ చిత్రానికి శ్రీనివాస్‌ గుండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా నా వైఫ్ మిస్సింగ్ అనే మూవీ కూడా చేస్తున్నారు.

ఈ నెల 21న వరుణ్ సందేశ్ తన బర్త్‌ డే సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు తన సతీమణితో కలిసి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో తన కెరీర్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనకు ఇండస్ట్రీలో దిల్‌ రాజు, ‍అల్లరి నరేశ్ చాలా సాయం చేశారని గుర్తు చేసుకున్నారు. ఇంటర్ చదివే సమయంలో ఓ గ్రాసరీ షాప్‌లో పనిచేశా.. అంతేకాకుండా క్యాషియర్‌గా కూడా పని చేశానని వరుణ్ తెలిపారు.

నా కెరీర్‌లో ఎత్తు, పల్లాలు చూశానని వరుణ్ సందేశ్ తెలిపారు. నా కెరీర్‌ డౌన్‌ఫాల్‌లో ఉన్నప్పుడు డీ ఫర్ దోపీడి మూవీలో దిల్‌ రాజు ఛాన్స్ ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటానని అన్నారు. అల్లరి నరేశ్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ గుర్తుంటుందని తెలిపారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో నా కష్టాల్లో అండగా నిలిచిన వీరిద్దరిని ఎప్పటికీ మరిచిపోలేనని వరుణ్ సందేశ్ తన మనసులోని మాటలు పంచుకున్నారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)