Breaking News

దర్శకధీరుడిపై డాక్యుమెంటరీ చిత్రం.. రామ్ చరణ్‌ పోస్ట్ వైరల్

Published on Tue, 08/13/2024 - 15:33

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌ బాబుతో జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కథ సిద్ధం కాగా.. షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే చిత్రం కావడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ఆసక్తి నెలకొంది.

అయితే ఇటీవల రాజమౌళి గురించి ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూపొందించిన మోడరన్‌ మాస్టర్స్‌ పేరుతో ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేశారు. ఇందులో ఆయన డైరెక్షన్‌, ఆర్ఆర్ఆర్, బాహుబలి సినిమాల కోసం చేసిన హార్డ్‌ వర్క్‌ను చూపించారు. మొత్తంగా  రాజమౌళి జీవిత విశేషాలను డాక్యుమెంటరీ రూపంలో ప్రేక్షకులను ముందుకు తీసుకొచ్చారు. 

తాజాగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్‌పై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు. ఆయన కథ చెప్పేవిధానం, డెడికేషన్ అద్భుతమంటూ కొనియాడారు. ఇలాంటి డాక్యుమెంటరీ రూపొందించడం రాజమౌళికి దక్కిన సరైన గౌరవమని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈ బయోగ్రాఫికల్‌ డాక్యుమెంటరీని అనుపమా చోప్రా సమర్పణలో అప్లాజ్‌ ఎంటర్‌టైన్మెంట్, ఫిల్మీ కంపానియన్‌ సంయుక్తంగా నిర్మించారు. రాఘవ్‌ ఖన్నా దర్శకత్వం వహించగా.. తన్వీ అజింక్యా సహ దర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుచోంది. 

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)