Breaking News

'రాజ్‌ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో ఎఫైర్స్'.. లావణ్య షాకింగ్ కామెంట్స్!

Published on Sun, 07/07/2024 - 14:49

రాజ్‌ తరుణ్- లావణ్య టాపిక్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. పరస్పర ఆరోపణలతో ఈ వివాదం మరింత ముదురుతోంది. హీరోయిన్‌ తామిద్దరం 11 ఏళ్లుగా లివ్ ఇన్‌ రిలేషన్‌లో ఉన్నామని.. ప్రస్తుతం మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ రిలేషన్‌లో ఉన్నాడంటూ లావణ్య ఆరోపిస్తోంది.  రాజ్ తరుణ్‌కు చాలామంది హీరోయిన్స్‌తో రిలేషన్స్‌ ఉన్నాయంటూ లావణ్య సంచలన కామెంట్స్ చేసింది. 

లావణ్య మాట్లాడుతూ..'నాకు రాజ్‌ తరుణ్‌కు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. దాదాపు 11 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. మాల్వీ మల్హోత్రా వచ్చాక నన్ను దూరం పెడుతున్నాడు. ఆమె నన్ను చంపేస్తానని బెదిరించింది. వాళ్లిద్దరు కలిసి చెన్నైలో ఓ హోటల్‌లో ఉన్నారు. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి.  నేను, రాజ్ తరుణ్ గుడిలో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తాను నన్ను వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. మస్తాన్‌ సాయికి, నాకు గొడవైంది. అందుకే అతనిపై ఫిర్యాదు చేశా. కొందరు నాతో మైండ్‌గేమ్‌ ఆడారు. ఆ గేమ్‌లో నేను, మస్తాన్ సాయి ఇద్దరం బాధితులమే. డ్రగ్స్‌ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రాజ్ తరుణ్ లేకుండా నేను బతకలేను.' అని అన్నారు.  

ఇంకా మాట్లాడుతూ.. 'నేను, మస్తాన్ సాయి ఎప్పుడు కూడా జంటగా కనిపించలేదు. ఒక పెళ్లికి గుంటూరు వెళ్లాం. అతను కేవలం నా మ్యూచ్‌వల్‌ ఫ్రెండ్‌. నాతో ఎవరు మాట్లాడినా అతనితో రిలేషన్‌లో ఉన్నట్లేనా? నాకు అన్యాయం జరిగింది. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా. నా దగ్గర రాజ్ తరుణ్ కాల్ రికార్డింగ్స్‌ కూడా ఉన్నాయి. లవర్ సినిమా నుంచి మాకు గొడవలు మొదలయ్యాయి. డబ్బుల కోసం నేను బెదిరించాల్సిన పనిలేదు. అతని కోసం చాలా భరించాను. రాజ్‌ తరుణ్‌కు చాలామంది అమ్మాయిలతో రిలేషన్స్‌ ఉన్నాయి. ' అంటూ షాకింగ్ కామెంట్స్‌ చేశారు. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)