Breaking News

అలాంటి దేశాల్లో మన డబ్బులు ఖర్చు చేయకండి: టాలీవుడ్ హీరో సిద్ధార్థ్

Published on Wed, 05/14/2025 - 14:43

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం స్వయంభూ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రానికి  భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాల సంగతి పక్కనపెడితే నిఖిల్  తాజాగా చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో చూసేద్దాం.

ఇండియా-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో నిఖిల్ సిద్ధార్థ్ ట్వీట్ చేశారు. పాక్‌కు మద్దతుగా టర్కీ నిలవడంపై నిఖిల్ ఫైరయ్యారు. ఇకపై ఎవరూ కూడా టర్కీని సందర్శించవద్దని భారతీయులను కోరారు. టర్కీలో భారతీయులు ప్రతి సంవత్సరం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తారని.. భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించే దేశాల కోసం డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. విహారయాత్రల కోసం అలాంటి దేశాలకు మనం వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. పాక్‌తో తాము సత్సంబంధాలు కొనసాగిస్తామని టర్కీ ప్రెసిడెంట్‌ ఎర్గోడాన్‌ చేసిన కామెంట్స్‌పై ఓ నెటిజన్స్‌ పోస్ట్ చేశాడు. దీనిపై టాలీవుడ్ హీరో నిఖిల్ రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండియా- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పాక్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. ఆ సమయంలో పాకిస్తాన్‌కు మద్దతుగా టర్కీతో పాటు చైనా కూడా సాయం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టర్కీ యాపిల్స్‌ను సైతం దిగుమతి చేసుకోవడం ఆపేశారు.

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)