Breaking News

సినిమాలపై ట్రంప్‌ టారిఫ్‌.. టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ రియాక్షన్

Published on Tue, 09/30/2025 - 15:14

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌ సినిమాలపై వందశాతం సుంకం విధించడంపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ స్పందించారు. ట్విటర్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ట్రంప్ సుంకాలు అమలు చేయడం సాధ్యం కాదని ట్వీట్‌ చేశారు. బెర్మన్ సవరణ చట్టం ప్రకారం సినిమాలపై దిగుమతి సుంకాలను పూర్తిగా అడ్డుకుంటుందని నిఖిల్ రాసుకొచ్చారు. ఈనెల 29న ఇచ్చిన ట్రంప్ ఆదేశాలపై చట్టపరమైన అడ్డంకులు ఎదుర్కొవాల్సిందేనని అన్నారు. అంతేకాకుండా సినిమాలపై వందశాతం సుంకం అమలు సాధ్యం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా.. టాలీవుడ్ హీరో నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ, ది ఇండియన్ హౌస్ చిత్రాల్లో నటిస్తున్నారు.

విదేశీ సినిమాలపై ట్రంప్‌ టారిఫ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇండియన్‌ సినిమాలకు భారీ షాక్‌ ఇచ్చారు. విదేశీ సినిమాలపై 100శాతం టారిఫ్‌ విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో నిర్మించే చిత్రాలకు మినహాయించారు. ట్రంప్‌ నిర్ణయంతో తెలుగు సినిమాలపై టారిఫ్‌ ఎఫెక్ట్‌ పడనుంది. దీంతో అమెరికాలో విడుదల చేసే టాలీవుడ్‌ సినిమాలు వందశాతం టారిఫ్‌ చెల్లించాల్సి ఉంది.  

విదేశీ సినిమాలపై 100శాతం విధిస్తూ ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. అందులో ‘మా సినిమా నిర్మాణ వ్యాపారం అమెరికా సంయుక్త రాష్ట్రాల నుండి ఇతర దేశాలు దొంగిలించాయి. ఇది చిన్నపిల్లవాడి నుండి మిఠాయి దొంగిలించినట్లే. బలహీనమైన, అసమర్థ గవర్నర్‌తో కాలిఫోర్నియా తీవ్రంగా దెబ్బతింది. ఈ దీర్ఘకాలిక, ఎప్పటికీ అంతం కాని సమస్యను పరిష్కరించేందుకు, అమెరికా వెలుపల నిర్మించే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను’అని పేర్కొన్నారు.

 

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)