Breaking News

'పోతారు.. మొత్తం పోతారు..' హీరో నాని ఆసక్తికర కామెంట్స్!

Published on Sun, 08/25/2024 - 16:42

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్‌ జంటగా నటించిన చిత్రం సరిపోదా శనివారం. ఈ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన అంటే సుందరానికి చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మరోసారి వీరిద్దరు జతకట్టడంతో అభిమానుల్లో అంచనాలు పెంచేసింది. రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండడంతో మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు చిత్రబృందం. తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన హీరో నాని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

నాని మాట్లాడుతూ.. 'కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే సినిమానే సరిపోదా శనివారం. ఇది చాలా నమ్మకంగా చెబుతున్నా. కొవిడ్‌ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకి రావడం లేదని చాలామంది అంటున్నారు. కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా వస్తారు. వస్తూనే ఉంటారు. ఆడియన్స్ ఎప్పుడూ మిస్ అవ్వరు. మనమే అప్పుడప్పుడు మిస్సవుతుంటాం. పోతారు.. మొత్తం పోతారు.. ఆగస్టు 29 అందరూ థియేటర్లకే పోతారు. వివేక్‌ ఆత్రేయ కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది' అని అన్నారు. కాగా.. ఈ  చిత్రంలో ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకు జేక్స్‌ బిజోయ్ సంగీతమందించారు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)